Ambani Antilia does not have single AC: ముంబైలోని అల్టామౌంట్ రోడ్‌పై ఉన్న అంటిలియా, ముకేష్ అంబానీ, నీతా అంబానీల 27 అంతస్తుల విలాసవంతమైన నివాసం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. రూ. 15,000 కోట్ల విలువైన ఈ భవనం 2010లో పూర్తయింది. గాజు గోడలతో నిర్మించిన ఈ భవనం ముంబై తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతల మధ్య కూడా సాధారణ ఏర్ కండిషనర్ (ఏసీ) యూనిట్లు లేకుండా కూల్‌గా ఉంటుంది. అవుట్‌డోర్ కంప్రెసర్లతో కూడిన సాంప్రదాయిక ఏసీలు లేకపోవడం వల్ల భవనం గాజు , మార్బుల్ సౌందర్యాన్ని కాపాడుతుంది. మరి ఏసీలు లేకుండా ఎలా అనేది చాలా మందికి వచ్చే సందేహం.

ఏసీలే లేని ముఖేష్ అంబానీ నివాసం

ఏసీలు లేవు కానీ.. ఒక అధునాతన సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టమ్‌ ఉంటుంది. ఈ సిస్టమ్ భవనం మొత్తాన్ని సమానంగా కూల్ చేస్తుంది. మాన్యువల్ అడ్జస్ట్‌మెంట్ అవకాశం లేకుండా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. అంటిలియా డిజైన్ పెర్కిన్స్ అండ్ విల్ ఆర్కిటెక్ట్స్ రూపొందించింది. ఇది 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. హెలిప్యాడ్‌లు, స్విమ్మింగ్ పూల్‌లు, స్పా, థియేటర్, జిమ్ వంటి విలాసాలతో నిండి ఉంది. అంబానీ కుటుంబం 27వ అంతస్తులో నివసిస్తుంది. అక్కడి నుంచి సముద్రం వ్యూ ఉంటుంది. స్వచ్చమైన గాలి కూడా వస్తుంది. భవనం సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టమ్ ప్రత్యేకంగా మార్బుల్, పూలు , ఇతర ఇంటీరియర్ ఎలిమెంట్లను సంరక్షించడానికి రూపొందించారు. సౌకర్యం కంటే భవనం దీర్ఘకాలిక సంరక్షణకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

భవనం మొత్తం ఒకే విధంగా చల్లగా ఉండే ఏర్పాట్లు

అంటీలియాలోని సెంట్రలైజ్డ్ సిస్టమ్ భవనం మొత్తాన్ని సమాన టెంపరేచర్‌లో ఉంచుతుంది, ఇది సాంప్రదాయిక ఏసీల కంటే ఎకో-ఫ్రెండ్లీ , ఎనర్జీ ఎఫిషియంట్. గాజు గోడలు సూర్యకాంతి, గాలిని సహజంగా ఫిల్టర్ చేస్తాయి, భవనం ఎత్తైన స్థానం ముంబై వేడి నుంచి రక్షణ ఇస్తుంది. అదనంగా, అంటిలియాలో 'స్నో రూమ్' అనే ప్రత్యేక గది ఉంది, ఇక్కడ ఆర్టిఫిషియల్ స్నోఫ్లేక్స్ తో క్లైమేట్-కంట్రోల్డ్ ఎన్విరాన్‌మెంట్ సృష్టిస్తారు. ఇది తీవ్రమైన వేడి నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఈ డిజైన్ అంబానీల ఇన్నోవేటివ్ ఆలోచనలను ప్రతిబింబిస్తుంది.

పర్యవారణపై అంబానీలకు ఉన్న ఆసక్తే కారణం

అంటిలియా కూలింగ్ వ్యవస్థ ముకేష్ అంబానీ గ్రీన్ ఎనర్జీ , సుస్థిరత పట్ల ఆసక్తిని చూపిస్తుంది, ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్విరాన్‌మెంటల్ గోల్స్‌తో సమానంగా ఉంటుంది. సాధారణ ఏసీలు లేకపోవడం వల్ల భవనం విజువల్ అప్పీల్ బాగుంటుంది. సెంట్రల్ సిస్టమ్ ద్వారా ఎనర్జీ సేవింగ్ సాధ్యమవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ విషయం, ఆధునిక ఆర్కిటెక్చర్‌లో ఇన్నోవేషన్‌కు ఉదాహరణగా నిలుస్తుంది, భవిష్యత్ లగ్జరీ హోమ్‌లకు మార్గదర్శకంగా మారుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.