Oscar 2025 Best Picture Winner Anora OTT Platform and Release Date Details: లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది. ఈ వేడుకలో మొత్తం 23 విభాగాలకు ఆస్కార్ విజేతలను ప్రకటించారు. ఈ ఏడాది రొమాంటిక్ - కామెడీ చిత్రం 'అనోరా' బెస్ట్ మూవీతో సహా ఐదు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్ట్రెస్ వంటి కేటగిరీలలో ఏకంగా 5 ఆస్కార్ అవార్డులను ఈ మూవీ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. మరి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సైతం ఫిదా అయిన ఈ మూవీని ఇండియాలో ఏ ఓటీటీలో చూడవచ్చో తెలుసా?

'అనోరా' మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
ఆస్కార్ అవార్డులలో సత్తా చాటి 'అనోరా' అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ అమెరికన్ మూవీ సిండ్రెల్లా, ప్రెట్టీ ఉమెన్ వంటి సినిమాలలాగే ఉంటుంది. ఇండియాలో 'అనోరా' మూవీ నవంబర్ 2024లో రిలీజ్ అయింది. కానీ ఇక్కడ ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే ఆ తర్వాత ఈ మూవీ ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఓటీటీ స్ట్రీమింగ్ పై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతానికి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ వంటి ఓటీటీలలో రెంట్ కి అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ మూవీని ఇండియాలో ఫ్రీగా డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. 2025 మార్చ్ 17న జియో హాట్ స్టార్ లో ఈ మూవీ ప్రీమియర్ కాబోతోంది.

Read Also : ఆస్కార్స్‌లో బ్రాడీ, హాలే బెర్రీ లిప్ లాక్ - 22 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. వైరల్ వీడియో చూశారా?

'అనోరా' స్టోరీ
ఈ సినిమా మొత్తం లాస్ వెగాస్ సెక్స్ వర్కర్, రష్యన్ బిలియనీర్ కొడుకు లవ్ స్టోరీ నేపథ్యంలో ఉంటుంది. ఒక రష్యన్ బిలియనీర్ కొడుకును, బ్రూక్లిన్ కు చెందిన వేశ్య అనోరా కలుసుకుంటుంది. ఆ తర్వాత అనుకోకుండా అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అబ్బాయి తల్లిదండ్రులకు తెలియకుండానే ఈ పెళ్లి జరుగుతుంది. దీంతో ఆమె జీవితం ఒక్కసారిగా సిండ్రెల్లా లాగా, ఏంజిల్ లా అద్భుతంగా మారిపోతుంది. కానీ పెళ్లి వార్త ఆ అబ్బాయి తల్లిదండ్రులకు తెలియడంతో, పెళ్లిని రద్దు చేయాలని న్యూయార్క్ కి వెళ్తారు. దీంతో ఆమెకు కష్టాలు మొదలవుతాయి. మరి అనోరా ఆ కష్టాలను ఎలా గట్టెక్కింది? పెళ్లి వల్ల అనోరాకు ఎదురైన కష్టాలు ఏంటి? చివరికి ఆ పెళ్లిని రద్దు అయ్యిందా ? లేదా? అసలు ఇంట్లో చెప్పకుండా ఈ జంట పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే. 2 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీకి ఐఎండిబి లో 7.7 రేటింగ్ ఉంది.

'అనోరా'కు అవార్డుల పంట
తాజాగా 'అనోరా' చిత్రానికి గాను సీన్ బేకర్ కు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. ఇందులో మిక్కీ మాడిసన్, మార్క్ ఐడెల్స్టెయిన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు మొత్తం 5 ఆస్కార్ అవార్డులను అందుకున్న ఈ సినిమాకు ఇంతకుముందు కూడా అవార్డుల పంట పడింది. 2024 మేలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీ పామ్ డి'ఓర్‌ అవార్డును గెలుచుకుంది. అనోరా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అండ్ రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా, BAFTA అవార్డులను కూడా గెలుచుకుంది.

Read Also : ఐదు ఆస్కార్స్‌తో సత్తా చాటిన షాన్‌ 'అనోరా'... బ్రాడీ, మైకీ బెస్ట్‌ యాక్టర్లు... కంప్లీట్ విన్నర్స్ లిస్ట్ ఇదిగో