Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్

10 months ago 8
ARTICLE AD
<p>AP Ministers Progress Report | అమరావతి: ఏపీలో గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మంత్రుల పనితీరుపై ఫోకస్ చేసింది. గత ఏడు నెలల్లో మంత్రుల పనితీరుపై నివేదిక పంపాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. గత ఏడాది జులై నుంచి డిసెంబరు వరకు మంత్రుల పనితీరుపై నివేదికలు పంపాలని ఆదేశాలిచ్చారు. కూటమి ప్రభుత్వంలో మంత్రుల అధికారిక కార్యక్రమాలతో పాటు, వారికి కేటాయించిన శాఖాపరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలపై రిపోర్ట్ చేయనున్నారు. మంత్రులు తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుతో పాటు పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు లాంటి ముఖ్య సమాచారాన్ని ఆరు నమూనాల ద్వారా ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం ఆదేశాలతో పలువురు మంత్రుల్లో టెన్షన్ మొదలైంది.</p> <p>&nbsp;ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్లు విడివిడిగా ఒక్కో శాఖలో మంత్రి నిర్ణయాలు, వారి పనితీరుపై సమాచారం ఇవ్వాలన్నారు. ఈ నివేదికల ఆధారంగా కూటమి ప్రభుత్వంలో ఏపీ మంత్రుల పనితీరుకు ప్రభుత్వం రేటింగ్ ఇవ్వనుంది. వీటితో పాటు గత రెండు క్యాబినెట్ ల లోను మంత్రులు పనితీరు నివేదిక ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ముగ్గురు మంత్రులు తప్ప మిగిలిన మంత్రులు తమ పనితీరు, శాఖలో మార్పులపై నివేదిక ఇవలేదని సమాచారం. సీఎం చంద్రబాబు సూచనతో పలువురు మంత్రులు స్వయంగా నివేదిక అందజేయని కారణంగా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఆయా శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది.</p>
Read Entire Article