SIT officials are searching Mithun Reddy house: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో జరిగినట్లుగా నమోదైన రూ. 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి ప్రాంతాల్లో 4 బృందాలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆఫీసు సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.

జూబ్లీహిల్స్, సోమాజిగూడ, ఫిల్మ్‌నగర్ ప్రశాసన్‌నగర్, యూసుఫ్‌గూడ గాయత్రీహిల్స్‌లోని ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. సోమాజిగూడలోని డికాట్ కొరియర్ కంపెనీ, కొండాపూర్ ఆఫీసులో కూడా తనిఖులు చేసినట్లుగా తెలుస్తోంది. డికాట్ కొరియర్ నుంచి మిథున్ రెడ్డికి చెందిన PLR ప్రాజెక్టులకు రూ. 25 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అధికారులు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డేటాను స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) మద్యం కుంభకోణం జరిగిందని కేసు నమోదు అయింది. మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో రూ. 3,200 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నారు. మిథున్ రెడ్డి జులై 19, 2025న అరెస్ట్ అయ్యారు, 71 రోజుల జ్యూడిషియల్ కస్టడీ తర్వాత సెప్టెంబర్ 29న బెయిల్ పై విడుదలయ్యారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు కార్యాలయాల్లో సిట్ సోదాలు
హైదరాబాద్ బెంగళూరు నివాసాల్లో సిట్ సోదాలు
4 బృందాలతో తనిఖీ చేస్తున్న సిట్ అధికారులు
మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆఫీసు సిబ్బందిని ప్రశ్నిస్తున్న అధికారులు
ఏపీ లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి pic.twitter.com/hfXBwbfKob

— Satya Telangana (@satya_telangana) October 14, 2025

SIT అధికారులు సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ రికార్డుల ఆధారంగా మరిన్ని విచారణలు చేపట్టే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి అమెరికా పర్యటన పిటిషన్ పై కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది.