When Andhra 22a Land Problems Solve: ఆంధ్రప్రదేశ్‌లో 22A సమస్య లక్షల మంది ఏపీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 1977లో అమలు చేసిన ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టం కింద పేదలు, భూమి లేని కుటుంబాలకు కేటాయించిన 35.4 లక్ష ఎకరాల భూములు ఇప్పటికీ వివాదాల్లోనే ఉన్నాయి. ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయకుండా, ట్రాన్స్‌ఫర్ చేయకుండా 22A లిస్ట్‌లో ఉంచడం వల్ల లక్షలాది మంది రైతులు, కుటుంబాలు ఆర్థిక నష్టాలు, సామాజిక అస్థిరత్వానికి గురవుతున్నారు. ప్రస్తుత NDA ప్రభుత్వం పరిష్కారాలు ప్రకటించినప్పటికీ, మార్చి 2025 నుంచి జూన్ 2026 వరకు విస్తరించిన ఆలస్యం ప్రజల అసంతృప్తిని పెంచుతోంది.

అసైన్డ్ చట్టం ప్రకారం భూములు బదలాయించకూడదు !

ఆంధ్రప్రదేశ్‌లో 22A భూముల సమస్యలు అసైన్డ్ చట్టం అమలు తీరుతో ప్రారంభమయ్యాయి. ఈ చట్టం ప్రకారం, SC/ST, BC, మైనారిటీలు, భూమిలేని పేదలకు కేటాయించిన భూములను ట్రాన్స్‌ఫర్ చేయకూడదని నిబంధనలు విధించారు. ఈ భూములు 'ప్రొటెక్టెడ్' గా ఉండాలని ఉద్దేశ్యం. కానీ భూములు పొందిన అనేక మంది వాటిని అమ్ముకోవడం, బదలాయించడం చేశారు. అలాగే రికార్డుల ఫ్రాడ్ వల్ల డాటెడ్ ల్యాండ్స్ గా మారాయి.

వైసీపీ హయాంలో సమస్య తీవ్రం

వైఎస్ఆర్సీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లుగా 22Aను అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో సమస్య తీవ్రం అయింది. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ప్రతి కాలనీ.. ప్రతి భూమిపై 22a అమలు చేశారు. కొన్ని చోట్ల ఆయా కాలనీల వాసుల వద్ద ప్రభుత్వం డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసింది. అంటే..అధికారికంగా అమ్మేసింది. గుంటూరులోని నల్లకుంటగా పిలిచే లక్ష్మిరఘురామయ్య నగర్ ఒకప్పుడు పేదలకు ప్రభుత్వం చిన్న చిన్న స్థలాల రూపంలో ఇచ్చింది. తర్వాత వాటిని నామినల్ ధరకు వారికి అమ్మకపు రిజిస్ట్రేషన్ చేసింది.కానీ వైసీపీ హయాంలో ఈ కాలనీని కూడా 22a కిందకు తెచ్చారు. ఈ కారణంగా ప్రజలు ఆస్తి ఉన్నా..దాన్ని బదలాయించుకోలేకపోతున్నారు. అదే సమయంలో రాజకీయకక్షలు తీర్చుకోవడానికి కూడా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే తమకు కావాల్సిన భూములకు మాత్రం ఫ్రీహోల్డ్ ఇచ్చి భూముల్ని కొట్టేసే కుట్ర చేశారన్న ఆరోపణలు రావడంతో 2024లో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా 20 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్ ఫ్రీజ్ విధించారు. మొత్తం అవకతవకలపై విచారణ జరుపుతున్నారు.

సామాన్యులకు కష్టాలు

ఈ సమస్యలు రైతులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలను బాధిస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో లక్షలాది అప్లికేషన్లు CCLA కు వచ్చాయి. SC/ST కమ్యూనిటీలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు, ఎందుకంటే ఈ భూములు వారి జీవనాధారం. 2025 జూలైలో రిజిస్ట్రేషన్ ఫ్రీజ్ రెండో సంవత్సరంలోకి ప్రవేశించడంతో సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తూ అలసిపోతున్నారు. ప్రస్తుత రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ జనవరి 2025లో 22A బ్యాన్ లిఫ్ట్ చేస్తామని ప్రకటించారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు మూడు రోజుల్లో రిపోర్ట్ సమర్పించమని ఆదేశాలు ఇచ్చారు. మార్చి 25, 2025న మంత్రి "ప్రైవేట్ ల్యాండ్స్‌ను 22A లిస్ట్ నుంచి తొలగించమని" కలెక్టర్లకు సూచించారు. ROR ) యాక్ట్‌లో అప్పీల్ అథారిటీని DROల నుంచి RDOలకు మార్చి, డిస్ప్యూట్ రిసాల్వ్ చేయడానికి వేగం తీసుకురావాలని చెప్పారు. తర్వాత డిస్ట్రిక్ట్-లెవల్ అసైన్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 16, 2025లో మార్చి నుంచి మూడు నెలల్లో పరిష్కరిస్తామని ప్రామిస్ చేశారు. కానీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు.

ఎప్పటికి పరిష్కరిస్తారు?

భూ సమస్యల పరిష్కారం అంత తేలిక కాదు. కానీ పరిష్కారం అసాధ్యం వైసీపీ హయాంలో జరిగిన అవకతవకల ఇన్వేస్టిగేషన్ కు అధిక సమయం పడుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ల్యాండ్ రీ-సర్వేలు, డిస్ట్రిక్ట్ కమిటీల ఏర్పాటు – జనవరి 20, 2025 నుంచి రీ-సర్వే ప్రారంభించారు, కానీ పూర్తి అమలుకు 4-6 నెలలు పడుతుందని అంటున్నారు. కానీ ఎప్పటికప్పుడు త్వరలో అంటున్నారు కానీ.., పరిష్కారం దిశగా ఆలోచనలు చేయడం లేదు. GoM రికమెండేషన్లు, డిజిటల్ రికార్డులు భూ-రక్ష వంటివి ద్వారా త్వరిత పరిష్కారం సాధ్యమేనని ప్రభుత్వానికి చిత్తశుద్ధే ఉండాలని అంటున్నారు. మరి ప్రభుత్వం ఆలకిస్తుందా ? ప్రభుత్వాలే సృష్టించిన పేదల కష్టాలు తీరుస్తుందా?