Ram Pothineni's Andhra King Taluka OTT Platforrm Locked : టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూక'. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. రిలీజ్‌కు ముందే ఓటీటీ ప్లాట్ ఫాం సైతం లాక్ చేసుకుంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏ మూవీ అయినా 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కూడా థియేట్రికల్ రన్ పూర్తైన 4 వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, శాటిలైట్ రైట్స్‌ను Zee గ్రూప్స్ సొంతం చేసుకోగా... ZEE సినిమాలు, Zee5లో ప్రీమియర్ కానుంది. అయితే, ఒకేసారి అటు ఓటీటీలోకి, ఇటు టీవీల్లోకి వస్తాయా? లేదా ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత టీవీల్లో ప్రీమియర్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read : హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు