Tadipatri: వివాహేతర బంధం పెట్టుకున్న ఓ భర్త ఆస్తి పంచాయతీలో భార్యను నరికి చంపేసి పరారైన ఘటన తాడిపత్రిలో జరిగింది. ఈ హత్య దృశ్యాలు సోషల్ మీడియాలో రికార్డయ్యాయి. కూర్చుని ఉన్న భార్యపై వేటకత్తితో వరుసగా మూడు సార్లు నరికాడు. ఆమె కుప్పకూలిపోయిన తర్వాత పరారయ్యాడు.

వివాహేతర బంధం పెట్టుకుని భార్యను దూరం పెట్టిన వెంకటేశ్వర్ రెడ్డి

తాడిపత్రికి చెందిన పుష్పవతి, వెంకటేశ్వర రెడ్డి దంపతులు. అయితే వెంకటేశ్వరరెడ్డి కొంత కాలంగా వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ అంశంపై భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. రెండు కుటుంబాల మధ్య పంచాయతీలు కూడా జరిగాయి. ఎప్పటికప్పుడు భార్యను సరిగ్గా చూసుకుంటానని పెద్దలకు మాట ఇచ్చి వచ్చే వెంకటేశ్వరరెడ్డి తర్వాత మాట తప్పేవాడు. వివాహేతర బంధం పెట్టుకున్న మహిళ దగ్గరే ఉండేవాడు. చివరికి వెంకటేశ్వరరెడ్డి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

పెళ్లి సమయంలో ఇచ్చిన ఆస్తితో పాటు కొంత సొొమ్ము ఇవ్వాలని భార్య తరపు బంధువుల పంచాయతీ

అయితే పెళ్లి సమయంలో ఇచ్చిన ఆస్తితో పాటు తనను మోసం చేసినందుకు..తన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన ఆస్తిని రాసివ్వాలని ఆమె పట్టుబడుతోంది. అయితే పెళ్లి సమయంలో ఇచ్చిన ఆస్తిని కూడా తిరిగి ఇచ్చేది లేదని వెంకటేశ్వర్ రెడ్డి చెబుతూ వసతున్నారు. ఈ అంశాన్ని పెద్ద మనుషుల వద్దకు తీసుకెళ్లారు. ఆస్తి తగాదాల పంచాయతీ పై తాడిపత్రి పట్టణంలోని ఓ లాడ్జిలో పంచాయతీ పెట్టారు పెద్దలు. ఇరు వర్గాలకు చెందిన కుటుంబ పెద్దలు వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో భార్యభర్తలు కూడా వచ్చారు. భార్య పుష్పవతి కుర్చీలో కూర్చుని ఉన్న సమయంలో భార్య వెంకటేశ్వర్ రెడ్డి వచ్చి మాట్లాడాడు. మాట్లాడుతున్న సమయంలోనే వేటకత్తి బయటకు తీసి నరికేశాడు.

Also Read: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్

పరిష్కరించుకునేందుకు ఓ లాడ్జిలో రెండు కుటుంబాల పెద్దల సమావేశం

వెంకేశ్వర్ రెడ్డి వేటకత్తి తీసి నరికే ప్రయత్నం చేసినా ఆమె ఎదురు తిరగలేదు. ఎంత అయినా భర్త అని.. అలా మృగాన్ని చంపినట్లుగా నరికి చంపడని అనుకుని ఉటుంది అయితే భార్యపై అప్పటికే పూర్తి స్థాయి కోపాన్ని పెంచుకున్న వెంకటేశ్వరర్ రెడ్డి మూడు సార్లు మేకను నరికినట్లుగా నరికేసి అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య పుష్పవతి స్పాట్‌లోనే చనిపోయింది.

ప్లాన్డ్ గా వేటకత్తి తీసుకొచ్చి నరికేసిన వెంకటేశ్వర్ రెడ్డి

ఈ హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంకటేశ్వర రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు పట్టుకునేందుకు గాలిస్తున్నారు. వివాహేతర బంధం మోజులో పడి భార్యను నరికేసి.. తాను జైలు పాలవుతున్నాడు వెంకటేశ్వరెడ్డి. ఆ కుటుంబం ఛిన్నభిన్నమైపోయింది.

Also Read: ట్రావెల్స్ సిబ్బంది అప్రమత్తతో బుక్కైన బీదర్ గ్యాంగ్- నోట్లు చూపించి బుట్టలో వేసేందుకు స్కెచ్‌