Anaganaga Oka Raju Movie Song Raju Gari Pelli Ro Lyrics : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ విలేజ్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ నుంచి తాజాగా 'రాజు గారి పెళ్లిరో' సాంగ్ రిలీజ్ చేయగా ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా... అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు. వెడ్డింగ్ స్పెషల్ సాంగ్ లిరిక్స్ అదిరిపోయాయి.

'రాజుగారి పెళ్లిరో' సాంగ్ లిరిక్స్

పల్లవి

టాలీవుడ్డు డీజే కొట్టు... బాలీవుడ్డు బట్టలు కట్టు...

హాలీవుడ్ బడ్జెట్ పెట్టు... టు.. టు.. టూ.. ఊ.. ఊ.. ఊ

అంబరాన డ్రోనులు చుట్టు... బంగారాల ప్లేటులు పెట్టు...

అంబానీయే కుల్లుకునేట్టు... టు.. టు.. టూ.. ఊ.. ఊ.. ఊ

హే సంగీత్ పాటలు హల్దీలో ఆటలు ఇన్ స్టాలో ఫోటోలు

పెట్టు పెట్టు పెట్టు

ఎంతో ఘనంగా ఇంత ధనంగా అనగనగా హే... హే... హే... హే

రాజు గారు పెళ్లిరో... ఊరువాడ లొల్లిరో...

రాదు ఇది మల్లీరో... ఎంజాయ్ ఫుల్లిరో...

రాజు గారు పెళ్లిరో... ఊరువాడ లొల్లిరో...

రాదు ఇది మల్లీరో... ఎంజాయ్ ఫుల్లిరో...

టాలీవుడ్డు డీజే కొట్టు... బాలీవుడ్డు బట్టలు కట్టు...

హాలీవుడ్ బడ్జెట్ పెట్టు... టు.. టు.. టూ.. ఊ.. ఊ.. ఊ

చరణం 1

ధగ ధగ నగలు అంట... నిగ నిగ వగలు అంట...

చూసినోళ్ల నోళ్ల వెంట హయ్ బాబోయ్ అంట...

వేల వేల వంటలు అంట... ఎన్నో కాంటినెంటెలు అంట...

వారం వరకు ఇక తినలేరంట...

రాజుగారితో రాణి చేరగా ఏడు తరములకి గుర్తుండే వైభోగమే...

ఈడు జోడుగా ఇద్దరుండగా... ఏడు జనమలకి నిలుచుండే కల్యాణమే...

ఎంతో ఘనంగా ఇంత ధనంగా అనగనగా హే... హే... హే... హే

రాజు గారు పెళ్లిరో... ఊరువాడ లొల్లిరో...

రాదు ఇది మల్లీరో... ఎంజాయ్ ఫుల్లిరో...

రాజు గారు పెళ్లిరో... ఊరువాడ లొల్లిరో...

రాదు ఇది మల్లీరో... ఎంజాయ్ ఫుల్లిరో...

రాజుగారి పెళ్లిరో... రాజుగారి పెళ్లిరో... రాదు ఇది మల్లిరో...

Also Read : ఇండియన్స్ స్క్రీన్‌పై 'ది రాజా సాబ్' స్వాగ్ - డార్లింగ్ లుక్స్, క్యారెక్టర్‌పై డైరెక్టర్ మారుతి బ్యూటిఫుల్ ఎలివేషన్