తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోలలో నవీన్ పొలిశెట్టి ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఈ హీరో కొత్త మూవీ రిలీజ్ మాత్రం చాలా ఆలస్యం అవుతోంది. చివరిసారిగా నవీన్ పొలిశెట్టి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో అనుష్క హీరోయిన్ గా నటించగా ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నవీన్ ను తెరపై చూసి చాలా కాలం కావడంతో ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అందుకే ఆయన కొత్త సినిమా 'అనగనగా ఒక రాజు' ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేస్తున్న అభిమానులకు తాజాగా ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. 'అనగనగా ఒక రాజు' మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లాక్ అయ్యింది.

'అనగనగా ఒక రాజు' డిజిటల్ రైట్స్ సోల్డ్
'జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో నవీన్ పొలిశెట్టి. అప్పటిదాకా కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన నవీన్ ఈ సినిమాతో హీరోగా ఆకట్టుకున్నాడు. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అంటూ సీనియర్ హీరోయిన్ తో నటించి అలరించాడు. ఇక ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. మూవీ రిలీజ్ కి ముందే నాగ వంశీ ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసి సినిమాను ప్రాఫిట్ జోన్లో పడేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ రైట్స్ ఎంత ధర పలికాయి అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Grab your gold, the King is getting married! 🤭
Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8

— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025

Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?

నవీన్ మూవీకి బ్రేకులు, రీస్టార్ట్
'అనగనగా ఒక రాజు' మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలమే అవుతుంది. కానీ పెద్దగా అప్డేట్స్ మాత్రం రావట్లేదు. మేకర్స్ గతంలో ఓ గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. చాలా కాలం గ్యాప్ తర్వాత టీజర్ ను వదిలారు. అందులో ప్రీ వెడ్డింగ్ వీడియో అంటూ 3 నిమిషాల 2 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో నవీన్ పొలిశెట్టి చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. 'ముఖేష్ మామయ్య' అంటూ ముఖేష్ అంబానీని, అంబానీల పెళ్లికి హాజరైన సెలబ్రిటీలపై తన సెటైర్లతో, పంచులతో మూవీ రిలీజ్ పై ఆసక్తిని క్రియేట్ చేశారు.

నిజానికి ఈ మూవీ అనౌన్స్ చేసిన తర్వాత మధ్యలో బ్రేక్ పడింది. కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ జరిగిన తర్వాత ఈ సినిమాను నిర్మాతలు ఆపేసినట్టు టాక్ నడిచింది. కానీ కొంతకాలం తర్వాత నిర్మాత నాగ వంశీ ఈ ప్రాజెక్టును రీస్టార్ట్ చేసి, నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాను అనౌన్స్ చేశాకే నవీన్ యాక్సిడెంట్ కి గురవడం, ఆ తర్వాత కోలుకొని మళ్ళీ షూటింగ్లో పాల్గొనడం వంటివి చేశారు. ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోంది.

Also Read: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!