Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్‌ కోమలిని చంపేయాలని గన్ గురి పెడతాడు. కోమలి మోకాళ్ల మీద పడి సార్ ఇందులో నా తప్పేం లేదు సార్ నన్ను వదిలేయండి సార్ అని అంటాడు. ఇంతలో విజయాంబిక, దీపక్‌లకు గన్ గురి పెట్టి దీనంతటి కారణమైన మిమల్ని వదలను అని వాళ్ల వైపు గన్ పెడతాడు.

విరూపాక్షి గన్ లాక్కొని సూర్య వాళ్లని చంపి నువ్వు హంతకుడు కావొద్దు వాళ్లకి తగిన శిక్ష పడాలి అని అంటుంది. విజయాంబిక, దీపక్‌లు షాక్ అయిపోతారు. ఒక్క బులెట్‌తో పోయే ప్రాణాలు కావు అవి.. అని ఇన్‌స్పెక్టర్‌ని పిలిచి అరెస్ట్ చేయమని అంటుంది. దీపక్, కోమలి, విజయాంబికల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తీరా చూస్తే ఇదంతా విజయాంబిక కల.. నిజానికి సూర్యప్రతాప్‌కి కోమలి గురించి ఇంకా పూర్తిగా నిజం తెలీదు.. ఇలా అడిగితే చెప్పవు నోరు తెరువు అని కోమలితో సూర్యప్రతాప్‌ అని గన్ తేవడానికి వెళ్తుంటే దీపక్ ఆపి తన ఫోన్‌ చూపించి కొన్ని ఆధారాలు ఉన్నాయి చూడు అంటాడు.

సూర్యప్రతాప్‌ చూసి షాక్ అయిపోతాడు. అందరూ ఏంటా అనుకుంటారు. ఏయ్ ఎంట్రా ఇది ఇలాంటి చెత్త వీడియోలు చూపించి నాకు బ్లాక్ మెయిల్ చేయాలి అనుకుంటున్నావా.. అని అడుగుతాడు. నేను బ్లాక్ మెయిల్ చేయించడం అని అంటావ్ ఏంట్రా అని అంటా అలా ఏం కాదు మామయ్య ఇప్పుడున్న టెక్నాలజీతో ఏమైనా చేయొచ్చు.. మీరు మంచి నాయకుడు అయినా ఇలాంటి రాసలీలలు చేస్తారని చెప్పొచ్చు అంతా ఏఐ మహిమ మామయ్యా. ఈ అమ్మాయి రూప కాదు కోమలి అని కూడా టెక్నాలజీని ఉపయోగించి చేయొచ్చు అని కోమలి కోమలి కాదు.. రూప అని నమ్మిస్తాడు. ఆ డాక్యుమెంట్స్ అనీ క్రియేట్ చేయించినవే అని అంటాడు.

సూర్యప్రతాప్‌ పూర్తిగా దీపక్ మాటలు నమ్మేస్తాడు. విజయాంబిక కలుగజేసుకొని వాడు వాడి తండ్రితో విరూపాక్షికి ఉన్న సంబంధం గుర్తు చేసుకొని కూడా వాడిని నమ్ముతున్నావా అని అంటుంది. కోమలి మళ్లీ నటన మొదలు పెడుతుంది. వీడు ఎవడో నాకు తెలీదు అని అనేస్తుంది. ఇంత జరిగాక ఎవరు ఇంట్లో ఉండాలి ఎవరు బయటకు వెళ్లాలో నిర్ణయించుకో అని అంటుంది. తల్లీకూతుళ్ల మోసాన్ని ఇంకా ఎన్ని సార్లు భరిస్తావు ఇలాంటి మోసగత్తెలకు నీ కళ్ల ముందు ఉండే అర్హత లేదు అని విజయాంబిక అంటుంది. విజయాంబిక అని విరూపాక్షి అరిస్తే సూర్యప్రతాప్‌ అడ్డుకొని కోమలి తన కూతురు రూపే అని నమ్మి నా కూతుర్ని చంపాలి అనుకున్నప్పుడే నువ్వు నన్ను నాన్న అని పిలిచే అర్హత లేదు అని రూపని తిట్టి నీ తల్లి బుద్ధులే వచ్చాయని తిడతాడు.

సూర్యప్రతాప్‌ కోపంగా మీరు ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయారు బయటకి పొండి.. నా చేతులతో మీ మెడలు పట్టుకొని బయటకు గెంటేసే పరిస్థితి తెచ్చుకోకండి వెళ్లిపోండి అని విరూపాక్షి రుక్మిణిగా ఉన్న అసలైన రూపకి చెప్తాడు. ఇద్దరూ ఏడుస్తూ వెళ్లిపోవడానికి రెడీ అవుతారు. విజయాంబిక, దీపక్, కోమలి నవ్వుకుంటారు. రాజు ఇద్దరినీ ఆపి సూర్యప్రతాప్‌ని బతిమాలుతాడు. ఇద్దరి తప్పు లేదు.. అమ్మాయిగారిని అనుమానించింది నేను అని నింద తన మీద వేసుకుంటాడు. కట్టుకున్న భార్య, కన్నకూతుర్ని ఇంటి నుంచి పంపేశారన్న చెడ్డ పేరు మీకు వద్దు పెద్దయ్యా అని బతిమాలుతాడు. దాంతో సూర్యప్రతాప్‌ నీ మాట మీద నమ్మకంతో వాళ్లని క్షమిస్తున్నా అని అంటాడు. రాజు ఇద్దరినీ ఓదార్చుతాడు.

విజయాంబిక, కోమలి, దీపక్‌తో చివరి నిమిషంలో సూపర్‌గా తప్పించావ్‌రా.. ఆనంద్‌తో వాళ్లు ప్లాన్ చేయడం నాకు తెలుసు మమ్మీ అని దీపక్ చెప్తాడు. రాజు, రూప, విరూపాక్షిలు మాట్లాడుకోవడం దీపక్ విని తన ఫ్రెండ్కి ఇలా చేయమని చెప్పానని అంటాడు. విజయాంబిక ఎగిరి గంతులేస్తుంది. ఆనంద్‌కి నా గురించి మొత్తం తెలుసు అని కోమలి అంటే వాడిని ఈసారి సూర్యప్రతాప్‌ నమ్మడు అని విజయాంబిక అంటుంది. రాజు నన్ను రూపగా నమ్ముతున్నాఅని చెప్పాడు అంటే నాతో కాపురం చేస్తాడా అని కోమలి అంటే రాజుకి రూప అంటే ప్రాణం కలలో కూడా ఏం తప్పు చేయడు అని దీపక్ అంటాడు. రాజు వాళ్లు మరో ప్లాన్ చేసే లోపు మనమే ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. కోమలికి అశోక్ కాల్ చేస్తాడు. దీపక్ వాళ్లు అశోక్‌తో మాట్లాడొద్దని అవసరం అయితే నెంబరు బ్లాక్ చేయమని దీపక్ అంటాడు. భర్త ప్రవర్తనకి విరూపాక్షి ఏడుస్తూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.