Ammayi garu Serial Today Episode కోమలి రూపతో రేపే నిన్నూ రాజుని విడదీస్తా అని ఛాలెంజ్ చేస్తుంది. రూప కోపంతో కోమలి వెళ్తుంటే నెట్టేస్తుంది. కోమలి వెళ్లి అభిషేకానికి నీరు తీసుకెళ్తున్న పంతులు మీద పడి అతన్ని నెట్టేస్తుంది. దాంతో పంతులు పడిపోతారు. పంతులు లేచి ఎంత పని చేశావే పాపిష్టిదానా.. ఎన్నో పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాన్ని నేలపాలు చేశావ్.. నువ్వు నాశనం అయిపోతావ్ అని శపిస్తారు.

రూప, రాజులు నవ్వుకుంటారు. చందు, సుమ వచ్చి సారీ చెప్పి ప్రాయశ్చిత్తం చెప్పమని అంటారు. చేతిలో కర్పూరం పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ 11ప్రదక్షిణలు చేయమని అంటారు. కోమలి షాక్ అయిపోతుంది. తప్పదా అని అడిగితే తప్పదు అక్క అని రూప చేతిలో కర్పూరం పెడితే రాజు వెలిగిస్తాడు. కోమలితో రూప రూప 2.0 చూశావు కదా అంటుంది. నీ సంగతి చెప్తా ఆగు అని కోమలి అంటే ముందు కర్పూరం చేతిలో పెట్టుకొని 11సార్లు తిరిగితే నీ పని అయిపోతుంది.. తర్వాత చూద్దువులే అని రూప, రాజులు కోమలిని గుడి చుట్టూ తిప్పేస్తారు. కోమలి చేయి కాలిపోతుంది. చేయి నొప్పి అని విలవిల్లాడిపోతుంది. విజయాంబిక, దీపక్‌లు ఓదార్చుతారు.

విరూపాక్షి సూర్యప్రతాప్‌ కోసం టిఫెన్ చేసి రమ్మని పిలుస్తుంది. సూర్యప్రతాప్‌ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తాడు. విరూపాక్షి చాలా హ్యాపీగా ఫీలవుతూ వడ్డిస్తుంది. సూర్యప్రతాప్‌ తింటాడు. అందతా ఫోన్‌లో చూసిన రూప,రాజు, మందారం, సుమ, చందు చాలా చాలా సంతోషపడతారు. రూప అందరితో ఇంట్లో నాన్న పరిస్థితి ఏంటో తెలీదు కానీ అమ్మ చాలా సంతోషపడుతుంది అని రూప అంటుంది. నెమ్మదిగా పరిస్థితులు అన్నీ చక్కపడతాయి అని అనిపిస్తుందని సుమ అంటుంది.

సూర్యప్రతాప్‌ తింటూ పొలమారితే విరూపాక్షి నీరు తీసుకొని వచ్చి తల మీద తట్టి కంగారుగా నీరు తాగిస్తుంది. ఆ సీన్ చూడటానికి చాలా బాగుంటుంది. రాజు, రూప వాళ్లు చాలా చాలా సంతోషపడతారు. సూర్యప్రతాప్‌ విరూపాక్షిని చూస్తూ నీరు తీసుకొని తాగుతాడు. విరూపాక్షి పొంగిపోతుంది. రాజు, రూప వాళ్లంతా ఓ చోట చేరి ఫోన్ చూసి పొంగిపోతుంటే విజయాంబిక, దీపక్, కోమలిలు చూస్తారు. మనం లేనప్పుడు చూస్తున్నారు., మనం ఉంటే చూడటం లేదు అసలు వీళ్లు ఏం చూస్తున్నారు అని అనుకుంటారు.

సూర్యప్రతాప్‌ టిఫెన్ చేసిన తర్వాత ఎలా ఉంది అని విరూపాక్షి అడుగుతుంది. బాగుంది అని చెప్పి సూర్యప్రతాప్‌ వెళ్లిపోతాడు. ఫస్ట్‌ టైం పెద్దయ్య గారు అమ్మగారికి మెచ్చుకున్నారని మందారం సంతోషపడుతుంది. విరూపాక్షి కూడా పొంగిపోతుంది. ఇన్నాళ్లకి సూర్యకి వండి పెట్టే అవకాశం రావడం.. నేను వడ్డిస్తే సూర్య తినడం.. బాగుంది అనడం నాకు మంచి రోజులు వచ్చినట్లు ఉన్నాయని విరూపాక్షి పొంగిపోతుంది. రూప అందరితో మన ప్లాన్ వర్కౌట్ అయింది. నాన్న అమ్మ కలుస్తున్నారు..అని రూప మాట్లాడుతుంటే విజయాంబిక, దీపక్, కోమలి వినేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.