Ammayi garu Serial Today Episode దీపక్ బంటీని కిడ్నాప్ చేసి రాఘవకు వేయాలి అనుకున్న ఇంజక్షన్‌ తనకు ఇవ్వమని రాజుకి బ్లాక్ మెయిల్ చేస్తాడు. రాజు విరూపాక్షి, రూపలతో నేను బంటీని కాపాడుతా మీరు ఇంజక్షన్ వేయించండి అంటాడు. అలా ఏం వద్దు ముందు బంటీ ప్రాణాలు ముఖ్యం అని విరూపాక్షి అంటుంది. ముగ్గురు బంటీ కోసం పరుగులు పెడతారు.

విజయాంబిక చాలా టెన్షన్ పడుతుంది. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది టెన్షన్ వద్దు అని కోమలి అంటే లేదు నాకు రాజు ఏదో చేస్తాడు అని అనిపిస్తుంది. రాజు ఇంజక్షన్ ఇస్తాడు అంటే అనుమానంగా ఉందని అంటుంది. రూప, రాజులు ఇంజక్షన్ పట్టుకొని దీపక్ చెప్పిన అడ్రస్‌కి బయల్దేరుతారు. ఓ రౌడీ ఫాలో అవుతూ దీపక్‌కి విషయం చెప్తాడు. బంటీ భయపడుతూ ఉంటాడు. ఎలా అయినా తప్పించుకోవాలి అని అనుకుంటాడు. టాయిలెట్ వస్తుందని చెప్పి పారిపోవాలని అనుకుంటే రౌడీలు పట్టుకుంటారు. చాకు చూపించి బంటీని భయపెడతారు.

రాజు, రూపలు ఇంజక్షన్ పట్టుకొని దీపక్ చెప్పిన గెస్ట్‌హౌస్‌లోకి వస్తారు. రౌడీ డోర్ లాక్ చేసేస్తాడు. దీపక్ మరో రౌడీతో రాజు ఇంజక్షన్ ఇస్తేనే బంటీని వదలమని అంటాడు. రాజు, రూపలు ఇంజక్షన్ తీసుకొని లోపలికి వెళ్తారు. రౌడీలు రాజు వాళ్లని ఆపి ఇంజక్షన్ బాక్స్ పెట్టమని చెప్తాడు. ఇద్దరూ లోపలికి వెళ్లి బంటీని చూస్తారు. బంటీని చంపేస్తామని చెప్పి బాక్స్ ఇవ్వమని అంటారు. రాజు ఇవ్వడంతో బంటీని అప్పగిస్తారు.

విజయాంబిక కోమలితో రాజుని అంత ఈజీగా నమ్మలేమని అంటుంది. ఇక రౌడీలు ఇంజక్షన్‌ కోసం బాక్స్ తీసి చూస్తే అందులో ఇంజక్షన్ ఉండదు.. ఫ్లాష్బ్యాక్‌తో రాజు ఇంజక్షన్ విరూపాక్షితో ఇంజక్షన్ పంపించేస్తాడు. ఇక రాజు రౌడీలను చితక్కొడతాడు. దీపక్ దూరం నుంచి చూసి భయపడతాడు. దీపక్ వెంటనే విషయం విజయాంబికకు చెప్పాలని పరుగులు తీస్తాడు. రౌడీలు రాజు నుంచి తప్పించుకొని పారిపోతారు.

దీపక్ విజయాంబికకు చెప్తాడు. రాజు వాళ్ల కంట పడకుండా దీపక్‌ని విజయాంబిక తప్పించుకోమని అంటుంది. ఇంజక్షన్ ఎక్కడుందో నాకు తెలుసు అనిఅంటుంది. విరూపాక్షి ఇంజక్షన్ పట్టుకొని హాస్పిటల్‌కి పరుగులు పెడుతుంది. విజయాంబిక, కోమలిలు విరూపాక్షికి ఎదురు పడతారు. నాకు తెలీకుండా ఇంజక్షన్ రాఘవకు వేయించేసి నా చాప్టర్ క్లోజ్ చేయించాలి అనుకుంటున్నావా.. నా చాప్టర్ క్లోజ్ అవ్వాలి అంటే నాతో తలపడేది కూడా నేను అవ్వాలి అని అంటుంది. మర్యాదగా అడ్డు తప్పుకో విజయాంబిక అని విరూపాక్షి అంటుంది. ఇక విజయాంబిక, కోమలి ఇద్దరూ విరూపాక్షి దగ్గర ఇంజక్షన్ బాక్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. నన్ను నువ్వు దాటి వెళ్లాలి అంటే ఆ దేవుడు దిగిరావాలి అని విజయాంబిక అంటుంది. అప్పుడే సూర్యప్రతాప్ అక్కడికి వస్తాడు. విరూపాక్షిని చూసి విజయాంబిక, కోమలిలు ఇంజక్షన్ బాక్స్ వదిలేస్తారు. ఇప్పుడు నన్ను ఆపు చూద్దాం అని విరూపాక్షి అంటుంది. ఇక సూర్యప్రతాప్ విరూపాక్షితో ఇంజక్షన్ ఇవ్వకుండా ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతాడు. విరూపాక్షి ఇంజక్షన్ పట్టుకొని పరుగులు పెడుతుంది. డాక్టర్ ఆ ఇంజక్షన్‌ని రాఘవకి వేస్తాడు.

విరూపాక్షి సూర్యని చూసి మనసులో మేం రమ్మని చెప్పినా పని ఉంది రాను అన్నావ్ కానీ మేం పిలవకుండా వచ్చావ్ అంటే నా విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని నీకు ఉందని అర్థమైందని విరూపాక్షి అనుకుంటుంది. డాక్టర్ రాఘవకి ఇంజక్షన్ వేస్తాడు. రాజు, రూపలు కూడా బంటీని తీసుకొని వచ్చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.