Ammayi garu Serial Today Episode అశోక్‌ తల్లిదండ్రులు విరూపాక్షి కోసం వస్తారు. విరూపాక్షి మాణిక్యం, జానకిలను తీసుకెళ్లి సూర్యప్రతాప్‌కి పరిచయం చేస్తుంది. కోమలి చాలా టెన్షన్ పడుతుంది. విరూపాక్షి వాళ్లు అనాథని కోడలిగా చేసుకుంటున్నారని ఆ అనాథ కూడా నేను కట్టించిన ఆశ్రమంలోనే ఉందని అంటుంది.

సూర్యప్రతాప్‌ వాళ్లతో ఏమైనా సమస్య ఉందా అని అడుగుతారు. దానికి మాణిక్యం మా అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేశాం.. మీ ఆశ్రమంలో ఉంది కాబట్టి తను మీ కూతురు లాంటి మీరంతా కుటుంబ సమేతంగా రావాలి అని పిలుస్తారు. వైజయంతి కోమలితో అందరూ వస్తే అది పెళ్లి కాదురా మా చావు అవుతుంది అని అంటుంది.

మాణిక్యం పెళ్లి కార్డు విరూపాక్షికి ఇస్తాడు. కోమలి వైజయంతితో అందులో మా ఫొటోలు ఉన్నాయి మమల్ని వాళ్లు చూస్తే మా పని అయిపోతుందని అనుకుంటారు. సూర్యప్రతాప్‌ని పిలిస్తే ఆయన కూడా వస్తా అని చెప్తాడు. బంటీ మేడ మీద నుంచి వస్తూ ఉంటాడు. ఇక విరూపాక్షి పెళ్లి కార్డులో కోమలి ఫొటో చూసే టైంకి బంటీని దీపక్ కిందకి తోసేస్తాడు. విరూపాక్షి కార్డు వదిలేసి బంటీ దగ్గరకు పరుగులు పెడుతుంది. అందరూ బంటీ దగ్గరకు వెళ్తారు. ఈలోపు కోమలి కార్డు తీసి దాచేస్తుంది. పెళ్లి కార్డుని పట్టుకొని గదిలోకి వెళ్లిపోతుంది.

విరూపాక్షి వాళ్లు బంటీకి గాయం అయిన హడావుడిలో పడిపోతారు. విజయాంబిక ఆ కార్డు తీసుకొని కోమలితో ఈ కార్డు ఉండాల్సిన భద్రంగా కాదు అసలు ఇది ఉండకూడదు అని దీపక్‌కి ఇస్తే దీపక్ దాన్ని చింపి పడేస్తాడు. రాజు, రూపలు బయట నుంచి వచ్చి రూప బంటీ కాలికి తగిలిన గాయం చూసి చాలా కంగారు పడుతుంది. బంటి ఎవరో తనని నెట్టేసినట్లు అయిందని చెప్తాడు. రాజు, రూపలు ఆలోచనలో పడతారు. ఇక కోమలి వెడ్డింగ్ కార్డు చింపేసినందుకు దీపక్ మీద కోప్పడుతుంది. ఇక విరూపాక్షికి అశోక్‌ తల్లిదండ్రులకు అశ్రమంలో అయిన పరిచయం గురించి చెప్తుంది.

రాజు, రూప, విరూపాక్షిలు బంటిని చూసుకుంటూ కోమలి గురించి మాట్లాడుకుంటారు. కోమలి పెళ్లికి బయటకు వెళ్తుంది కదా.. తన పెళ్లిలో అత్తామామలు ఉంటారు కదా అప్పుడు దొరికిపోతుందని విరూపాక్షి అంటుంది. ఇక విజయాంబిక వాళ్లు పెళ్లిలోపు ఆస్తి కొట్టేయాలి అని అనుకుంటారు. డాక్టర్ రాజుకి కాల్ చేసి రాఘవలో ఎలాంటి మార్పు లేదని.. కానీ కోమాలో ఉన్న వారికి ఓ ఇంజెక్షన్ వేస్తే వాళ్లు కోలుకుంటారు అని కానీ ఇంజెక్షన్ చాలా కాస్ట్ అని చెప్తారు. ఎంత కాస్ట్ అయినా పర్లేదు అని రాజు అంటాడు. అదే విషయం విరూపాక్షి, రూపలకు చెప్తాడు. ముగ్గురు చాలా సంతోషపడతారు.

బంటీ రాత్రి విరూపాక్షి గజ్జెలు తీసుకొచ్చి చేతికి కట్టి గెంతుతాడు. తర్వాత కాళ్లకి కట్టి గెంతులేస్తాడు. సూర్యప్రతాప్‌ అది చూస్తాడు. బంటీ వాటిని నేల మీదకు విసిరేస్తాడు. ఆ గజ్జెలు చూస్తే సూర్యప్రతాప్‌కి ఎక్కడలేని కోపం అని చంద్ర భయపడతాడు. సూర్యప్రతాప్‌ ఆ గజ్జెను పట్టుకొని బంటీకి ఇస్తాడు. బంటీ దాన్ని పట్టుకొని కాళ్ల కింద వేసి తొక్కాలని చూస్తే సూర్యప్రతాప్‌ బంటీ అని పెద్దగా అరుస్తాడు. అందరూ షాక్ అయి బయటకు వస్తారు. అందరూ సూర్యప్రతాప్‌కి విరూపాక్షి గజ్జెలు, నాట్యం అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఈ పాయింట్ మీద బంటీని తిడతాడు అని అనుకుంటారు.

సూర్యప్రతాప్‌ కోపంగా అవి ఆడుకునేవి కాదు బంటీ,, భరతనాట్యానికి వాడేవి. వాటి ప్రాముఖ్యత గొప్పతనం తెలుసా.. వాటిని ఆడిస్తే సౌండ్ మాత్రమే వస్తుందని నీకు తెలుసు కానీ ఇవి కాళాకారుల ప్రాణం వాటిని దైవంతో సమానంగా చూసుకుంటారు అని ప్రాముఖ్యత చెప్తారు. అందరూ ముఖ్యంగా విజయాంబిక సూర్యప్రతాప్‌ అలా చెప్పడంతో షాక్ అయిపోతుంది. విరూపాక్షి చాలా సంతోషపడుతుంది. మీ అమ్మమ్మకి కూడా నాట్యం అంటే ప్రాణం.. మీ అమ్మమ్మ ఈ గజ్జెలను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది.. ఇన్ని ఏళ్లగా వీటిని ఇంత జాగ్రత్తగా దాచుకుంది అంటే ఇవి తనకు ఎంత ముఖ్యమో తెలుసా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.