Ammayi garu Serial Today Episode విజయాంబిక, దీపక్ ఇద్దరి నోళ్లు అతుక్కోవడంతో నానా అవస్థలు పడతారు. సూర్య ప్రతాప్‌ తప్ప అందరూ నవ్వుకుంటారు. రూప కూడా నవ్వి తండ్రి చూడగానే సైలెంట్ అయిపోతుంది. సూర్యప్రతాప్‌ వేడి నీరు పోసి ఇద్దరి నోళ్లు తెరచుకునేలా చేస్తారు. ఇద్దరూ వేడికి అరవలేక ఉండలేక తిప్పలు పడతారు.

రెండు రోజుల్లో పెళ్లి ఉంది ఇలాంటి పనికి మాలిన పనులు చేయొద్దని సూర్యప్రతాప్ చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత రూప రాజుని కలుస్తుంది. రాజు గాయాల్ని చూసి బాధ పడుతుంది. విజయాంబిక, దీపక్‌లే నిన్ను కొట్టించారని రూప రాజుతో చెప్తుంది. రాజు షాక్ అవుతాడు. ఏ పెళ్లి ఆపుతానని భయంతో కొట్టించారో అదే పెళ్లి జరగకుండా అడ్డుకుంటానని అంటాడు. రూప ఈ విషయం తనకు వదిలేయమని రాజుని దూరంగా ఉండమని చెప్తుంది. దాంతో రాజు కుదరదని చెప్తాడు. మందారానికి ఎలా అయినా న్యాయం జరగాలి అని రూప అంటుంది. పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ చివరకు రూప ఆడపెళ్లి వాళ్లకి చెప్దామని అంటుంది. వద్దని రాజు అంటాడు. ఒకవేళ సక్సెస్ అయితే మనకే మంచిది కదా అని రూప అనడంతో ఇద్దరూ ఆడపిల్ల వారి ఇంటికి బయల్దేరుతారు.

ఆడపెళ్లి వాళ్లు పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రూప వాళ్లు అక్కడికి వెళ్తారు. పెళ్లి వాళ్లు మాటలు చాటుగా వింటారు. అక్కడ వాళ్లు ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటున్నట్లు మాట్లాడుకుంటారు. పెద్ద ఇళ్లు కూడా అద్దెకు తీసుకున్నామని, గిల్ట్ నగలు తీసుకున్నామని మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న రూప రాజుతో పచ్చి మోసగాలు అని అనుకుంటారు. 5 ఏళ్ల కొడుకు ఉన్న తండ్రిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నది ఆస్తి కోసమే అని పెళ్లి చేసుకొని ఆస్తిలో వాటా కొట్టేయాలని మౌనిక అంటుంది. రూప గొడవ చేయడానికి వెళ్లబోతే రాజు ఆపుతాడు. వీళ్ల చేసే మోసాన్ని అందరి ముందు బయట పెడితే పెద్దయ్యా గారే పెళ్లి ఆపుతారని అంటాడు.

విజయాంబిక, దీపక్‌లు నగలు, డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నగలు, నగదు ఉంటేనే అమెరికా వెళ్లగలమని అందుకే అవి ఇస్తేనే పెళ్లి జరుగుతుందని అంటుంది. రూప ఇంటికి వస్తుంది. సుమతో ఏంటి అత్తయ్య వాళ్లు ఎదురు చూస్తున్నారు అని అడుగుతుంది. దాంతో సుమ బంగారం, డబ్బు తీసుకొస్తామని చెప్తారు కదా దాని కోసం అని అంటుంది. రూప తనలో తాను నవ్వుకుంటూ వస్తున్నారు అత్తయ్య వాళ్లు నగలు తీసుకురాగానే వాళ్ల బండారం బయట పెట్టి ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తానని అనుకుంటుంది. ఇంతలో పెళ్లి వాళ్లు వస్తారు. విజయాంబిక ఎదురెళ్లి స్వాగతం పలుకుతుంది. రెండు రోజుల్లో ఈ నగలతోనే అమెరికా చెక్కేయాలి అని దీపక్ అనుకుంటాడు. మౌనిక మనసులో ఇవి నగలు మాత్రమే కాదు ఈ రాజమహాల్‌లో నేను దీపక్ భార్యగా మహారాణిలా ఉండటానికి కారణం అనుకుంటుంది.

ఇక మౌనిక తల్లి విజయాంబిక చేతిలో నగల బ్యాగ్ పెడుతుంది. చెక్ చేయమని అంటే అవసరం లేదని విజయాంబిక అంటుంది. రూప చెక్ చేయమని ఇవి గిల్ట్ నగలు అయ్యిండొచ్చు కదా అని అంటుంది. రూప కావాలనే ఇలా అంటుందని దీపక్ అడ్డుకుంటాడు. దాంతో రూప నేను దీపు కోసం వీళ్లని ఎంక్వైరీ చేశానని వీళ్లు పేదవాళ్లని నిన్ను పెళ్లి చేసుకొని కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటున్నారని ఇవి గిల్ట్ నగలు కావాలంటే పరీక్షించమని రూప అంటుంది. దానికి విజయాంబిక వాళ్లతో ఇవి గిల్ట్ నగలు అయితే పెళ్లి జరగదు అని అంటుంది. వాళ్లేమో ఇవి గిల్ట్ కాకపోతే పెళ్లి జరగదు అని అంటాడు. ఇక సూర్య ప్రతాప్ రావడంతో విజయాంబిక విషయం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి ప్రమాదం.. ప్రాణాలకు తెగించి కాపాడిన త్రిపుర.. గాయత్రీ మీద నింద!