Ammayi garu Serial Promo Today Episode మందారానికి పసరు మందు పని చేయకుండా జీవన్ అందులో కెమికల్స్ కలిపేస్తాడు. దాంతో మందారం కోలువకోవడానికి మృత్యుంజయ హోమం చేద్దామని సీఎం బామ్మర్ది విజయాంబిక భర్త స్వామీజీ చెప్తారు. దాంతో అందరూ గుడి దగ్గర మృత్యుంజయ హోమం చేస్తారు. పరమశివుడుని పులకరింపజేయడానికి రూప నాట్యం చేస్తుంది. ఈ తరుణంలో తాజా ప్రోమోలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ప్రోమోలో ఏం జరిగిందంటే..

మందారం కోలుకుంటూ ప్రమాదం అని భావించిన విజయాంబిక తమ్ముడు సూర్యప్రతాప్‌నే చంపేస్తే ఏం గొడవ ఉండదు అనుకొని జీవన్‌కి చెప్తుంది. దాంతో జీవన్ అఘోరా గెటప్ వేసుకొని వస్తాడు. సీఎం సూర్యకి కాల్ రావడంతో గుడి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతాడు. ఒంటరిగా దొరికాడనుకొని జీవన్ తన త్రిశూలంతో సూర్యని పొడవబోతాడు. ఇంతలో రాజు వచ్చి సూర్యప్రతాప్‌ని పిలిచి తీసుకెళ్లిపోతాడు. దాంతో జీవన్ తప్పించుకున్నాడు. ఈ రోజు ఎలా అయినా సూర్య ప్రతాప్‌ని చంపేయాలని అనుకుంటాడు. ఇక రూప నాట్యం వేస్తుంటే దీపక్ వాళ్లు గులాబి రెక్కల్లో గాజు పెంకులు కలిపి రూప కాళ్ల కింద పడేస్తారు. దాంతో రూప విలవిల్లాడిపోతుంది. ఆ టైంలో జీవన్ సూర్యప్రతామ్‌ మీదకు దూసుకొస్తాడు. త్రిశూలం ఎత్తడంతో మందారం వచ్చి జీవన్ చేయి పట్టుకుంటుంది. మందారం కోలుకొని శివంగిలా జీవన్‌ అంతు చూడటానికి రావడంతో అందరూ షాక్ అయిపోతారు. దీంతో ప్రోమో పూర్తయిపోతుంది.

ప్రోమో 2 లో ఏం ఉందంటే.. ఇవాళ వచ్చిన రెండో ప్రోమో చూస్తే సూర్య ప్రతాప్‌కి మందారం నిజం చెప్పినట్లు తెలుస్తుంది. తన ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది భర్త, అత్తలే అని చెప్పినట్లు ఉంది. దాంతో సూర్యప్రతాప్ బావ, దీపక్‌లను పట్టుకొని ఒకరి ప్రాణాలు తీయాలి అనుకున్న మీలాంటి వాళ్లని బతకనివ్వకూడదని చంపేయాలి అని ఇద్దరి గొంతు పట్టుకుంటాడు. ఇద్దరినీ చంపేయండి నాన్న అని రూప చెప్తుంది. మందారం అబద్ధం చెప్తుందని దీపక్ అంటాడు. ఇక స్వామీజీ బావతో బావగారు మీరు వీళ్లని చంపడానికి మమకారం అడ్డు వస్తే నాకు వదలండి నేను చంపుతానని అంటాడు. దానికి స్వామీజీ వద్దు బావగారు వీళ్లని నేనే చంపుతానని అంటాడు. ఇద్దరి గొంతు నులిపేస్తూ సూర్యప్రతాప్ ఇద్దరినీ చంపేయాలని చూస్తాడు. దీంతో ఇవాళ్టి రెండో ప్రోమో కూడా పూర్తయిపోతుంది. సూర్యప్రతాప్ నిజంగానే అక్క, మేనల్లుడిని చంపేశాడా లేదా ఇందంతా విజయాంబిక వాళ్ల కలా.. మందారం నిజంగానే లేచిందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

ప్రోమోలో చూపించిందే నిజం అయితే సూర్య ఇద్దరినీ చంపేస్తే లేదంటే పోలీసులకు అప్పగిస్తే తర్వాత సూర్య రాజు, రూపల తప్పు లేదని వాళ్లని దగ్గరకు తీసుకోవచ్చు. రాజు రాఘవని కూడా తీసుకొచ్చి నిజం నిరూపిస్తే 20 ఏళ్లకు పైగా దూరం పెట్టిన భార్య విరూపాక్షిని దగ్గరకు తీసుకొవచ్చు.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!