Alzheimers Reverse and Memory Recovery : వయసు పెరిగే కొద్ది వచ్చే సమస్యల్లో అల్జీమర్స్ ఒకటి. వివిధ కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల ఇది వస్తుంది. ఇది వస్తే మెదడులో బ్రెయిన్ సెల్స్ ఆటోమెటిక్గా డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల మెమరీ తగ్గిపోతుంది. రోజూవారీ చేసే పనులు సామర్థ్యం తగ్గిపోయేలా చేస్తుంది ఈ న్యూరో డిజెనరేటివ్ డిజార్డర్. అయితే దీనికి పర్మినెంట్ సొల్యూషన్ లేదు కానీ.. తగ్గించేందుకు కొన్ని లైఫ్స్టైల్లో మార్పులు, వైద్యుల సూచనలు ఫాలో అవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు తాజా పరిశోధనలు అల్జీమర్స్కి బ్రేక్త్రూని కనిపెట్టాయి.

అల్జీమర్స్కి కారణాలు..

అల్జీమర్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మెదడులో బీటా-అమీలాయిడ్ అనే ప్రోటీన్ ఎక్కువమోతాదులో పెరిగి.. ప్లాక్స్గా ఏర్పడుతుంది. దీనివల్ల నరాల మధ్య కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఇది మెమరీలాస్కు ప్రధాన కారణంగా చెప్తారు. అలాగే మెదడులో టావ్ ప్రోటీన్ అబ్నార్మల్‌గా మారి బ్రెయిన్ సెల్స్ ట్రాన్స్పోర్టేషన్ని సిస్టమ్ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల బ్రెయిన్ సెల్స్ చనిపోయి అల్జీమర్స్ రావచ్చు.

ఆరోగ్య పరమైన సమస్యలు కూడా

కొందరిలో జెనిటికల్గా వస్తుంది. వయసు పెరిగేకొద్ది వచ్చే ప్రధాన సమస్యల్లో ఇది ఒకటి. హై బీపీ, ఒబెసిటీ, డయాబెటిస్, స్మోకింగ్ చేయడం, శారీరక వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ వంటి లైఫ్స్టైల్ అల్జీమర్స్ రిస్క్ని పెంచుతాయి. ఇన్ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు కూడా నరాలు దెబ్బతింటాయి. తలకు గాయాలు వంటివి జరిగినప్పుడు మెమరీ లాస్ అవ్వచ్చు.

పరిశోధనలో అద్భుత ఫలితాలు..

ఈ అల్జీమర్స్ చికిత్సపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మెదడులో ఏర్పడే హానికరమైన “అమీలాయిడ్ ప్లాక్”లను తొలగించే ట్రీట్‌మెంట్పై పరిశోధన చేయగా.. అది విజయవంతమైనట్లు తెలిపారు. మెమరీ లాస్‌కు ప్రధాన కారణమైన దీనిని జయించినట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా ల్యాబ్ టెస్టుల్లో తీసిన బ్రెయిన్ స్కాన్స్‌లో Before-After గా ప్లాక్ గణనీయంగా తగ్గినట్టు కనిపించిందని పేర్కొన్నారు.

అల్జీమర్స్ను ఆలస్యం చేస్తుందట

బ్రెయిన్లోని ఈ ప్రోటీన్ ప్లాక్‌లు బీటా-అమీలాయిడ్ ప్రోటీన్స్‌తో తయారై.. మెదడు నరాల మధ్య కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తాయి. అందుకే మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. దీనిని తగ్గించేందుకు Leqembi (Lecanemab) అనే ఔషధాన్ని ఉపయోగించారు. దీనికి FDA ఆమోదం కూడా లభించింది. ఇది ప్రారంభ దశ అల్జీమర్స్‌ ప్రోగ్రెషన్‌ను slow చేసి.. మెదడులోని ఈ ప్లాక్లను శుభ్రం చేయడంలో సహాయపడుతోంది.

మరెన్నో పద్ధతులు

CRISPR జీనె ఎడిటింగ్, అల్ట్రాసౌండ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి పద్ధతులు కూడా క్లినికల్ ట్రయల్స్‌లో శక్తివంతమైన రిజల్ట్స్ చూపిస్తున్నాయని తెలిపారు. అయితే ఇది పూర్తి నివారణి కాదు అని.. కానీ అల్జీమర్స్ తగ్గించడంలో ఇది మంచి ఫలితాలు ఇస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని ముందుగా గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే మంచిఫలితాలు చూడవచ్చని చెప్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.