Allu Sirish New Movie Title: ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం యంగ్ హీరోలకు పెద్ద సవాలుగా మారుతోంది. టైటిల్, టీజర్ నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ ప్రేక్షకులకు కొత్తదనం కనిపించకపోతే సినిమా హాళ్లకు రావడం లేదు. ఆ సంగతి యువ కథానాయకుడు అల్లు శిరీష్ (Allu Sirish Latest News) బాగా తెలుసుకున్నారు. తన కొత్త సినిమాకు వైవిద్యమైన టైటిల్ ఖరారు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే....

'మగజాతి ఆణిముత్యం'గా అల్లు శిరీష్!
Allu Sirish New Movie Titled Magajaathi Animutyam: 'మగజాతి ఆణిముత్యం'... ఇది అల్లు శిరీష్ కొత్త సినిమా టైటిల్. ఈ మాట ఎక్కడో విన్నట్టు ఉందా? సుమంత్ అశ్విన్ హీరోగా మారుతి కాంపౌండ్ నుంచి వచ్చిన 'లవర్' సినిమా గుర్తు ఉందా? అందులో మెంటల్ పేషెంట్ పాత్రలో మగజాతి ఆణిముత్యంగా కమెడియన్ సప్తగిరి ప్రేక్షకులను నవ్వించారు.

'లవర్' సినిమాలో మగ జాతి ఆణిముత్యం అంటూ సప్తగిరి చేసిన వినోదం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అల్లు శిరీష్ కొత్త సినిమాకు ఆ టైటిల్ ఖరారు చేస్తే... ఇండస్ట్రీలో ప్రముఖులకు సైతం సప్తగిరి డైలాగ్ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదులుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు.

Also Read: Tharun Bhascker: ఆ చెంపదెబ్బలు ఒరిజినల్... ఈషా రెబ్బాను గట్టిగా కొట్టిన తరుణ్ భాస్కర్

రెండేళ్ల విరామం తర్వాత అల్లు శిరీష్...
ఆచితూచి సినిమాలు చేసే హీరోలలో అల్లు శిరీష్ ఒకరు. సినిమా సినిమాకు మధ్య కనీసం ఏడాది అయినా విరామం తీసుకుంటారు. 'ఏబిసిడి', 'ఊర్వశివో రాక్షసివో' సినిమాల మధ్య మూడేళ్ల విరామం ఉంటే... 'ఊర్వశివో రాక్షసివో', 'బడ్డీ' సినిమాల మధ్య రెండేళ్ల విరామం ఉంది. ఇప్పుడు 'బడ్డీ' విడుదలైన రెండేళ్లకు కొత్త సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా దర్శకుడు, నిర్మాత, ఇతర వివరాలు వెల్లడించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: Varanasi Movie: అప్పుడు 'బాహుబలి'... ఇప్పుడు 'వారణాసి'... మళ్ళీ లొకేషన్ రెక్కీ కోసం ఆ దేశానికి రాజమౌళి

ఈ ఏడాది (2026) అల్లు శిరీష్ జీవితంలో చాలా స్పెషల్. మార్చ్ నెలలో ఆయన నయనికతో ఏడడుగులు వేయనున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అలాగే రెండేళ్ల విరమణ తర్వాత మళ్లీ కొత్త సినిమా ప్రారంభించబోతున్నారు.‌ అల్లు శిరీష్ రీ ఎంట్రీ ఘనంగా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్.

Also Read: Gatha Vaibhava Review - 'గత వైభవం' రివ్యూ: Prime Videoలో ఆషికా రంగనాథ్ సినిమా... మూడు జన్మల ప్రేమకథ ఎలా ఉందంటే?