Allu Arjun Sets New Trend For Remuneration : 'పుష్ప' ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ నుంచే ఆయన సరికొత్త ట్రెండ్ సృష్టించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు రెమ్యునరేషన్‌గా ఓ ఫిక్స్‌డ్ అమౌంట్ తీసుకోగా 'పుష్ప' మూవీకి మాత్రం ఆయన బిజినెస్‌లో వాటా తీసుకున్నట్లు టాక్ వినిపించింది.

అట్లీ మూవీకి భారీగా...

బన్నీ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తుండగా... ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుగుతోంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో మూవీ తెరకెక్కిస్తుండగా... అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతనే దానిపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. 'పుష్ప 2' మూవీతో కంపేర్ చేస్తే ఆయన ఈ మూవీకి కూడా భారీగానే తీసుకుంటున్నట్లు సమాచారం. బన్నీ కండిషన్‌కు సన్ పిక్చర్స్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

'పుష్ప 2'తో కంపేర్ చేస్తే...

'పుష్ప 2 : ది రూల్' మూవీ నుంచి అల్లు అర్జున్ పర్సంటేజ్ స్ట్రాటజీలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. జరిగిన మొత్తం బిజినెస్‌లో 27 శాతం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దాదాపు రూ.1000 కోట్ల బిజినెస్ జరగ్గా... బన్నీ రూ.270 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇక అట్లీ సినిమాకు కూడా అదే మోడల్ కంటిన్యూ చేస్తున్నారు. మూవీ రిలీజ్ తర్వాత థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మొత్తం బిజినెస్‌ల నుంచి 27 నుంచి 30 శాతం వరకూ రెమ్యునరేషన్ తీసుకోనున్నారట.

వేటికవే ఒప్పందాలు జరుగుతుండడంతో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని తెలుస్తోంది. బన్నీ సన్నిహితుడు బన్నీ వాస్ ఈ వ్యవహారాలను చూసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూవీ రిలీజ్ తర్వాత లాభాలు షేర్ చేసుకోవడం కాకుండా ఏకంగా బిజినెస్‌లోనే వాటాను రెమ్యునరేన్‌గా తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఈ స్ట్రాటజీతో ఇండియన్ సినిమాలో బన్నీ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : సంక్రాంతి తమిళ హిట్ - కార్తీ, శ్రీలీల మూవీస్‌ను మించిన బ్లాక్ బస్టర్... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?