Samantha Wishing For The Success Of Akhil Akkineni Lenin Movie : అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని విలేజ్ మాస్ ఎంటర్టైనర్ లెనిన్ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. సినిమాలో అఖిల్ యాక్షన్ సీక్వెన్స్, నటన, ఎమోషన్స్ అదిరిపోయాయంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ కమ్ బ్యాక్ అయ్యారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. తాజాగా, స్టార్ హీరోయిన్ సమంత కూడా మూవీ బిగ్ సక్సెస్ కావాలని టీంకు విషెష్ చెప్పారు.

'బ్లాక్ బస్టర్ వైబ్'

అఖిల్ అక్కినేని, లెనిన్ మూవీ టీంకు శుభాకాంక్షలు అంటూ సమంత పోస్ట్ చేశారు. 'లెనిన్ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్. ఇది భారీ బ్లాక్ బస్టర్ కాబోతోందనే సంకేతాలు ఆల్రెడీ కనిపిస్తున్నాయి.' అంటూ పోస్ట్ చేశారు. దీంతో పాటే ట్రైలర్ కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. కాగా ఇప్పటికే సమంత 'మా ఇంటి బంగారం' మూవీ సక్సెస్ కావడంపై అఖిల్ ప్రశంసలు కురిపించారు. సమంత నటనపై ప్రశంసలు కురిపిస్తూ... ఓ మహిళ పాత్రతో ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతమని కొనియాడారు.

Also Read : Lenin Twitter Review - లెనిన్ ట్విట్టర్ రివ్యూ: ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సూపర్బ్... అఖిల్ అదరగొట్టాడు... యూఎస్ టాక్ ఎలా ఉందంటే?