Ajith Pawar Comments Viral: బుధవారం ఉదయం మహరాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం, NCP నాయకుడు అజిత్‌పవార్ మృతి చెందడం షాక్‌కు గురి చేసింది. మహరాష్ట్ర రాజకీయాల్లో కీలకనేతగా ఉన్న ఆయన మృతి రాజకీయవర్గాలనే కాక సామాన్య జనాలు కూడా దానిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే 20 రోజుల కిందట అజిత్‌పవార్ చేసిన వ్యాఖ్యలు ఇవాళ జరిగిన సంఘటనకు కనెక్టు అవుతున్నాయి. ప్రజలు ఆయన చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకుంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ జనవరి 9న సాంగ్లీలో జరిగిన ఈ మీటింగ్‌లో ఆయన స్థానిక నాయకులతో మాట్లాడుతూ.. “ పైలట్ పిలిస్తే.. మనం వెళ్లాల్సిందే” అని కామెంట్ చేశారు. ఆ రోజు కార్యక్రమంలో ఆయన్ను కలిసేందుకు ఎక్కువ మంది వస్తుండటంతో.. తాను తొందరగా వేరే చోటకు వెళ్లాలని.. పైలట్ మెసేజ్‌ పంపిస్తే వెళ్లక తప్పదని అన్నారు. అయితే ఇవాళ విమాన ప్రమాదంలో ఇలా జరగడంతో అందరూ దానినే గుర్తు చేసుకుంటున్నారు.

మనం సేఫ్‌గా ల్యాండ్ అయ్యామంటే.. పైలట్ మహిళ అని అర్థం

అలాగే వారం రోజుల క్రితం ఆయన చేసిన ట్వీట్ కూడా ఇవాల్టి సంఘటనకు కనెక్ట్ అవుతోంది. జనవరి 18న మహిళా శక్తి గురించి ప్ర్తస్తావిస్తూ ఆయన వేసిన ట్వీట్ కూడా ప్రస్తావనకు వస్తోంది. ఆ రోజు ఆయన “మనం విమానంలో అయినా.. హెలికాప్టర్‌లో అయినా సేఫ్‌గా ల్యాండ్ అయ్యామంటే దాని పైలట్ మహిళ అని అర్థం” అని ట్వీట్ చేశారు. అయితే ఇవాళ పవార్ పయనించిన బంబార్డియర్ లియర్‌జెట్‌ 45 పైలట్లలో ఒకరు మహిళ కావడం యాధృచ్చికం. ఈ ప్రమాదంలో మహిళా పైలట్ శాంభవి పాఠక్ కూడా చనిపోయారు

When we travel by helicopter or plane, if our plane or helicopter lands smoothly, we understand that the pilot is a woman.#NCPWomenPower

— Ajit Pawar (@AjitPawarSpeaks) January 18, 2024

పవార్ మృతి తర్వాత ఇప్పుడు ఈ రెండు సోషల్‌మీడియా పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి.