Adilabad News: అమావాస్య రోజు పెళ్లా? దీపావళి నాడు ప్రత్యేక సంప్రదాయం, ఆశ్చర్యపరిచే నిజాలు!

1 month ago 2
ARTICLE AD

Diwali Special :  అమావాస్య అనగానే అమ్మో అంటారు మంచి చెడు తిథులు చూసుకునేవారు. అమావాస్య రోజు ఏ పనీ కొత్తగా ప్రారంభించరు.. కానీ ఈ ఊర్లో మాత్రం అమావాస్య రోజే పెళ్లి చేసుకుంటారు

అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు

అమావాస్య రోజు కొత్తగా ఏమీ ప్రారంభించరు

విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్నిరంగాల్లోనూ  అమావాస్యతో కొత్తగా ఏమీ మొదలుపెట్టరు

అమావాస్య వరకూ ఎందుకు..ఆ రోజుకన్నా నాలుగైదు రోజుల ముందు నుంచీ ఏమీ చేయరు..ఎదురు అమావాస్యతో చేయకూడదు అనే సెంటిమెంట్ చాలా మందికి ఉంటుంది

కానీ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో  దండారి ఆదివాసీలకు ఓ ప్రత్యేక సంప్రదాయం ఉంది. దీపావళి అమావాస్యరోజే పెళ్లిచూపులు..అదే రోజు పెళ్లి ఏర్పాట్లు చేసేసుకుంటారు. అంటే ఈ సమయానికి వారికి పంటచేతికొస్తుంది. డబ్బుంటుంది. అందుకే ఆ ఆనందంలో పండుగ చేసుకుంటారు. ఇందులో భాగంగానే పెళ్లీడుకొచ్చిన యువతీ యువకుల పెళ్లి చూపుల తంతు కూడా జరుగుతుంది. నచ్చితే వెంటనే పెళ్లిచేసేసుకుంటారు. దీపావళి రోజు పంట చేసుకునే పండుగ. ఈ వేడుకలో పెళ్లీడుకొచ్చిన యువకుల పెళ్లి చూపుల తంతు కూడా జరుగుతుంది. ఒకరికొకరు నచ్చితే వెంటనే పెళ్లి కూడా చేస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొదలు భాద్రపదం వరకూ ఆదివాసీలకు సాగుపనులుంటాయి. దీపావళి ముందు రోజు అంతాకలసి లక్ష్మీపూజ చేస్తారు. తెల్లటి దుస్తులు ధరించి పశువులకు నైవేద్యం పెడతారు. ఎడ్లమెడలకు వాతలు పెడతారు.. ఇలాచేస్తే వాటికి రోగాలు రావని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో మనుషుల మెడపైనా వాతలు పెడతారు.

డప్పు, కత్తి, సన్నాయి, లాఠీలను పంట కాపలాకు వెళ్లేటప్పుడు తీసుకెళ్తారు. వాటికి కూడా దీపావళి ముందు రోజు వేడుకలో భాగంగా పూజలు చేస్తారు. భీమం చెట్ల కింద ప్రత్యేక పూజలు చేసి తెల్లటి వస్త్రంలో మూటకట్టి కోడి లేదా మేకను బలిస్తారు. పూజ పూర్తయ్యాక ఆ మూటను ఇంటికి తీసుకెళ్లి భద్రపరుస్తారు. మళ్లీ ఆషాఢం వచ్చాకే మూట విప్పుతారు. ఈ పండుగ సందర్భంగా మొక్కులు తీర్చుకోవాలి అనుకునేవారు దండారి వేషం వేస్తారు. వీళ్లంతా గుస్సాడీ దుస్తులు ధరిస్తారు..వారంపాటూ ఉపవాస దీక్షలు చేపడతారు. చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఆడిపాడుతారు. దీపావళి రోజు దీక్ష విరమిస్తారు. ఈ వారం పాటూ జరిగే దండారి ఉత్సవాల్లో భాగానే పెళ్లిచూపులు..పెళ్లి జరిగిపోతుంది. అయితే ఎవరెవరికి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారో వారి వివరాలు ఇరు కుటుంబాల వారు ముందుగానే పంపించుకుంటారు. దీపావళి రోజు పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఇద్దరూ అంగీకరిస్తే వెంటనే పెళ్లి చేస్తారు. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు.

మొత్తానికి దీపావళి రోజు ఊరూవాడా సంబరంగా క్రాకర్స్ వెలిగిస్తారు... ఆదివాసీలు ఆ సందడితో పాటూ పెళ్లి సందడి కూడా జరిపించేస్తారు. అందుకే దండారి ఆదివాసీలకు దీపావళి పెద్దపండుగ...

లక్ష్మీ పూజ అక్టోబర్ 20 లేదా 21 ఎప్పుడు చేయాలి? శుభముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకోండి.

నరక చతుర్దశి 2025 ఎప్పుడు! 19 లేదా 20 అక్టోబర్ 2025 ? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Read Entire Article