<p>Girl Kidnap in Adilabad District | గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను యువకుడు కిడ్నాప్ చేసి తన ఇంట్లో దాడిపెట్టాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికను కిడ్నాప్ చేసి మధ్యాహ్నం నుంచి అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆ ఇంటిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకని బాలికను రక్షించారు. అమ్మాయిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం యువకుడిని నిర్మల్ మీదుగా నిజామాబాద్ కు తరలించారు.</p>