Adilabad Bandh: ఆదిలాబాద్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు.. ధర్నా చేస్తున్న మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

3 months ago 6
ARTICLE AD

Adilabad Bandh | ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన సోయాబీన్ పంటలను వెంటనే కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఆదిలాబాద్ బంద్ పిలుపునిచ్చారు. బంద్ లో భాగంగా ఆదిలాబాద్ బస్ డిపో ఎదుట నాయకులు ఆందోళన నిర్వహించారు. బస్టాండ్ ముందు టైర్లు కాల్చి డిపో ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనలో మాజీ మంత్రి జోగు రామన్న బిఆర్ఎస్ పార్టీ నేతలు హాజరై నిరసన చేపట్టారు.

రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బంద్ లో భాగంగా మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఆందోళన విరమించాలని కోరగా వినకపోవడంతో వారిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. మాజీ మంత్రిని అరెస్టు చేసి మావల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

జిల్లాలో సోయా రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ మాజీ మంత్రి జోగు రామన్న పిలుపు మేరకు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అఖిలపక్ష రైతు సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచినప్పటికీ, ప్రయాణికుల రద్దీ తక్కువగా కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

Read Entire Article