Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
3 months ago 7
ARTICLE AD
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ, విమానయాన శాఖ జాయింట్ యూజర్ సర్వీస్ లకు ఇదివరకే అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ఎయిర్ పోర్టు మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా భూసేకరణ, అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టింది. అంతేకాక ఇటీవల జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ జీవో 36 ప్రకారం నిధులు మంజూరు చేయడం ఎయిర్ పోర్ట్ ఏర్పాటులో కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే శంకర్ పలు దఫాలుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను కలిసి ఎయిర్ పోర్ట్ ఆవశ్యకతను వివరించారు. ఇందుకు కేంద్ర రక్షణ శాఖ నుండి ఇటీవల గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక అందజేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బలమైన అడుగులు పడడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ పోర్టు ఏర్పాటుతో పాటు 2.5 కి. మీ. పరిధిలో రన్ వే, పర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాది, దక్షిణ రాష్ట్రాలకు మధ్య వారధిగా ఆదిలాబాదులో రక్షణ శాఖ సిబ్బంది శిక్షణకు అనువైన స్థలంగా గుర్తించారు.
రూ.2,278 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ భూ సేకరణ, మౌలిక అభివృద్ధి పనులకు రూ. 2,278.14 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదిలాబాద్ నుండి అనుకుంటా గ్రామం వరకు ఆర్.అండ్.బి తరపున రూ.35 కోట్లు, 2200 ఎకరాల భూ సేకరణకు రూ.1, 510 కోట్లు, హై టెన్షన్ టవర్ల తొలగింపు ప్రత్యామ్నాయ విద్యుదీకరణ నిర్మాణానికి రూ.310 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో ఒక అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం కలిగింది. ఎయిర్ పోర్టు రాకతో ఇక ఆదిలాబాద్ జిల్లా ముఖచిత్రం మారబోతుందని, ఉపాధి అవకాశాలతో జిల్లాలో ఎంతోమంది జీవితాలు కూడా బాగుపడతాయని అభిప్రాయపడుతున్నారు.
Read Entire Article