Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

3 months ago 6
ARTICLE AD
<p>Karur Stampede Incident | తమిళనాడులోని కరూర్&zwnj;లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి 'తమిళ వెట్రి కళగం' (TVK) అధినేత, నటుడు విజయ్&zwnj;కు సిబిఐ (CBI) షాక్ ఇచ్చింది. గత సెప్టెంబర్ 27న కరూర్&zwnj;లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.</p> <p>నటుడు విజయ్ సభకు ఆలస్యంగా రావడంతో జనాలు అధికంగా పోగవడంతో తొక్కిసలాట జరిగిందని, సరైన నీటి సదుపాయం లేక చాలా మంది డీహైడ్రేషన్&zwnj;కు గురై మరణించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 12వ తేదీన ఢిల్లీలోని తమ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని విజయ్&zwnj;కు సిబిఐ సమన్లు జారీ చేసింది. కరూర్ ఘటనపై నటుడు విజయ్&zwnj;కి నోటీసులు జారీ కావడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.</p> <p>ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది. రిటైర్డ్ జడ్జి అజయ్ రస్తోగి నేతృత్వంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు సుమిత్ చరణ్, సోనల్ మిశ్రా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే కరూర్ ఎస్పీ సహా పలువురు పోలీసు అధికారులను, బాధిత కుటుంబాలను సిబిఐ విచారించింది. సభ నిర్వహణలో పోలీసుల భద్రతా లోపాలు ఉన్నాయా లేదా పార్టీ నిర్వాహకుల ప్రణాళికా లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://tamil.abplive.com/web-stories/food/how-to-make-panchratna-pickle-at-home-245629" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article