ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో ఏదైనా సాధించాలంటే ఏకాగ్రత, పట్టుదల, నిలకడ ముఖ్యమని యంగెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, స్కోప్ యాప్ (SCOPE App) ఫౌండర్, సీఈవో అప్పల్ల సాయికిరణ్(22) పేర్కొన్నారు. ఏబీపీ దేశం డిజిటల్ ప్లాట్‌ఫాం నిర్వహించిన స్మార్ట్ ఎడ్ కాన్‌‌క్లేవ్ (ABP Desam Smart Ed Conclave) లో పాల్గొని ఆర్థిక అంశాలపై విలువైన సూచనలు చేశారు. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్నిసరైన చోట ఇన్వెస్ట్ చేయడం అనేది జీవితంలో చాలా అవసరం అన్నారు. ఏబీపీ స్మార్ట్ ఎడ్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న యంగ్ టాలెంటెడ్ అప్పల్ల సాయికిరణ్ పలు విషయాలను షేర్ చేసుకున్నారు.

మనీ మైండ్‌సెట్: సంపాదించడమే కాదు, ఇన్వెస్టర్లుగా ఎదగాలి

నేటి ప్రపంచంలో ఆర్థిక అక్షరాస్యత (Financial Literacy) అనేది ఛాయిస్ కాదు. ప్రతి ఒక్కరికీ ఫైనాన్షియల్ అంశాల్లో అవగాహనా ఉండాలని అప్పల్ల సాయికిరణ్ పేర్కొన్నారు. కేవలం ఉద్యోగాల కోసం వెతకడం మానేసి, వాల్యూ క్రియేటర్స్‌ గా మారాలని, తెలివైన పెట్టుబడిదారులుగా మారాలని సూచించారు.

18 ఏళ్లకే సంచలనం.. 92 మిలియన్ డాలర్ల సమీకరణ

యంగెస్ట్ ఇన్వెస్టి‌మెంట్ బ్యాంకర్ అప్పల్ల సాయికిరణ్ 18 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం 22 ఏళ్ల ఆయన స్కోప్ (Scope) అనే ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటివరకు సుమారు 92 మిలియన్ల (భారత కరెన్సీలో దాదాపు 770 కోట్లు) నిధులను స్టార్టప్‌ల కోసం సమీకరించడం విశేషం. అంతేకాకుండా సొంతంగా వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను కూడా ప్రారంభించారు.

సక్సెస్ సీక్రెట్.. పట్టుదల, రిస్క్‌ తీసుకోవడం

తన మొదటి ఇన్వెస్టి‌మెంట్‌ను సాధించడం అంత సులభం కాలేదని అప్పల్ల సాయికిరణ్ గుర్తు చేసుకున్నారు. అమెరికాకు చెందిన తన మెంటార్ కిమ్ పెరిల్‌కు వరుసగా 8 నెలల పాటు ప్రతిరోజూ ఈమెయిల్స్ పంపానని, తన పట్టుదలను చూసి ఆమె 10 నిమిషాలు టైం ఇచ్చారని తెలిపారు. ఆ 10 నిమిషాల టైంలోనే తన ప్లాన్ వివరించి ఆమెను ఇంప్రెస్ చేయడం ద్వారా లక్ష డాలర్లు(సుమారు ₹84 లక్షలు) ఇన్వెస్టి‌మెంట్‌తో పాటు ఎంతో విలువైన ఆమె మెంటార్‌షిప్ పొందినట్లు గుర్తుచేసుకున్నారు.

యువతకు స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్ కీలక సూచనలివే..

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: అసలైన ఆర్థిక అక్షరాస్యత (Financial Literacy) కోసం సోషల్ మీడియాలో కనిపించే తప్పుదోవ పట్టించే సలహాలను నమ్మవద్దు. అక్కడ కనిపించేవన్నీ నిజం కాకపోవచ్చు. చెప్పే వ్యక్తి ఎంతకరకు జెన్యూన్ అని తెలుసుకున్నాకే వారు చెప్పే సలహాలు, సూచనలు నమ్మడం బెటర్.

చిన్న మొత్తంతో ఇన్వెస్ట్ చేయండి: ఇన్వెస్ట్ చేయడానికి ప్రస్తుతం వయస్సుతో గానీ, పెద్ద మొత్తంతో గానీ సంబంధం లేదు. నెలకు రూ.5,000 ఉన్నా సరే SIP ద్వారా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. మరోవైపు ఆదాయాన్ని పెంచుకుంటూనే, ఇతర ఇన్వెస్టిమెంట్ మార్గాలు వెతకాలి.

రిస్క్ తీసుకోవడానికి భయపడవద్దు: చాలా మంది ఈ విషయం తెలుసుకోవాలి. టీనేజర్స్, లేక పాతికేళ్లలోపు ఉన్న యువత ఏదైనా జాబ్ లేదా బిజినెస్ లాంటి ఏదైనా విషయంలో ఓడిపోతే పదిమంది ఏమనుకుంటారు? అనే ఆలోచనను మైండ్ నుంచి దూరంచేయాలి. మన వద్ద కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు రిస్క్ తీసుకోవడంలో తప్పులేదు. ఒకవేళ మీరు అనుకున్నది దక్కించుకుంటే సక్సెస్, ఒకవేళ ఓడితే దాని నుంచి కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. అంతేకానీ విఫలం అయ్యామనే ఛాన్సే లేదన్నారు.

ఎప్పుడూ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: ఇన్వెస్టర్ల దగ్గర డబ్బు తీసుకోవడం కంటే, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమైన పని అని అప్పల్ల సాయికిరణ్ పేర్కొన్నారు. ఎందుకంటే ఒక్కసారి ఒకరి వద్ద నమ్మకం కోల్పోతే ఆర్థిక రంగంలో మనుగడ కష్టమని హెచ్చరించారు.

తెలియకపోతే అడగాలి: ఆర్థిక రంగంలోని క్లిష్టమైన పదాలు (IRR, DPI వంటివి) తెలియకపోయినా సిగ్గుపడకుండా నిపుణులు, లేదా అవగాహన ఉన్న వారిని అడిగి తెలుసుకోవాలని, నేర్చుకోవడానికి ఎప్పుడూ వెనకాడవద్దని సూచించారు.

సంపద అంటే ఏమిటి?

తన దృష్టిలో సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదని, అది స్వేచ్ఛ అని.. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నచ్చిన వర్క్ చేయడం అని సాయికిరణ్ అభిప్రాయపడ్డారు.  సంపాదించే వ్యక్తి కేవలం నేటి గురించి ఆలోచిస్తే, ఇన్వెస్టర్ మైండ్‌సెట్ ఉన్న వ్యక్తి ఫ్యూచర్ ప్లానింగ్‌తో ఉంటాడని తెలిపారు. అయితే ‘సరైన సమయం కోసం వేచి చూడకండి. ఆ సమయం ఎప్పటికీ రాదు. ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే రైట్ టైం అని మొదలుపెట్టాలి. ఆశ ఉండాలి కానీ అందుకు తగ్గ ప్రయత్నం చేయాలని యువతలో స్ఫూర్తిని నింపారు.