అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో టీమిండియా ఓపెనర్లు రాణించారు. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ వరల్డ్ కప్‌లో తొలిసారి ఆకట్టుకున్నాడు. కీలక మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా ఆడిన అభిషేక్, కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 18 బందుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. స్టేడియం అన్నివైపులా భారీ షాట్లు ఆడుతూ ఫాంలోకి వచ్చాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్‌తో కలిసి కివీస్ బౌలర్లను టెన్షన్ పెట్టాడు. ఈ ఇద్దరూ భారీ షాట్లతో అలరించిన అతను, జట్టుకు బలమైన పునాది వేశారు.

అయితే, హాఫ్ సెంచరీ తర్వాత మరింత జోరు పెంచే క్రమంలో రచిన్ రవీంద్ర వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి, వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6x4 3x6) పెవిలియన్ చేరాడు. 8వ ఓవర్ తొలి బంతిని రచిన్ ఆఫ్ స్టంప్ అవతల వేయగా, వైడ్ వెళ్లే బాల్‌ను వెంటాడి మరీ టచ్ చేసి వికెట్ సమర్పించుకున్నట్లు అయింది. కానీ టోర్నీ మొత్తం ఫెయిల్ అయిన అభిషేక్ ఫైనల్లో తనదైన శైలిలో సునామీ ఇన్నింగ్స్ తో అలరించాడు.

Going BIG early on! 🚀

Abhishek Sharma and Sanju Samson's 𝗽𝗼𝘄𝗲𝗿 play! 💪

Updates ▶️ https://t.co/5LXBod8bl1#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #Final | #INDvNZ | @OfficialAbhi04 | @IamSanjuSamson pic.twitter.com/CM4X0M5dog

— BCCI (@BCCI) March 8, 2026

నాకౌట్ మ్యాచులలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
T20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచులలో అభిషేక్ శర్మ 18 బంతుల్లో చేసిన హాఫ్ సెంచరీనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇటీవల జరిగిన సెమీస్‌లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ సౌత్ ఆఫ్రికా జట్టుపై, ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ టీమిండియాపై 19 బంతుల్లో అర్ధ సెంచరీలు సాధించారు. తాజాగా అభిషేక్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ ఈ టోర్నమెంట్‌లో నాకౌట్ మ్యాచులలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

పవర్ ప్లేలో అత్యధిక స్కోరు..

సంజూ శాంసన్ తో కలిసి అభిషేక్ శర్మ పవర్ ప్లే లో అద్భుతంగా ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్ల లయను దెబ్బతీశారు. వీరిద్దరి దూకుడు బ్యాటింగ్ తో పవర్ ప్లే 6 ఓవర్లలో టీమిండియా 92 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 98 రన్స్ వద్ద అభిషేక్ తొలి వికెట్ రూపంలో నిష్క్రమించాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోరు. టీమిండియాకు సైతం టీ20 వరల్డ్ కప్ లో తొలి వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం.

సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలోని టీమ్ ఇండియా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా వరుసగా రెండోసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో, అభిషేక్ అందించిన ఈ శుభారంభం భారత్ భారీ స్కోరు సాధించడానికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ భారత్ ఈ ఫైనల్ గెలిస్తే భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటుంది.