Fahadh Faasil Confirms Aavesham 2 : మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'ఆవేశం' మూవీ. 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మలయాళ సినిమా దాదాపు రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది. రౌడీ షీటర్ రంగాగా ఫహాద్ నటన ఆడియన్స్‌ను కట్టి పడేసింది. తాజాగా 'ఆవేశం' సీక్వెల్‌పై ఫహాద్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.

'ఆవేశం 2' ఎప్పుడంటే?

'ఆవేశం 2'పై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఫహద్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'ఆవేశం 2' సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని... ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 2027 లేదా 2028లో ఈ మూవీ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక, మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'పేట్రియాట్'లో తాను నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు.

'ఆవేశం' మూవీకి జీతూ మాధవన్ దర్శకత్వం వహించగా... ఆయన ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో మూవీ చేస్తున్నారు. హై ఎనర్జీ కాప్ యాక్షన్ కామెడీగా ఈ మూవీ తెరకెక్కుతుండగా... ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాతే జీతూ మాధవన్ 'ఆవేశం 2' పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.ఆ

Also Read : సన్నీ లియోన్ క్రైమ్ థ్రిల్లర్ - మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మూవీ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?