Aha New Original Series Aakali Rajyam OTT Release Date : ఆకలి రాజ్యం... ఈ పేరు వింటే మనకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మూవీ గుర్తొస్తుంది. 1981లో డైరెక్టర్ కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ అప్పట్లో ఓ సంచలనం. కమల్ హాసన్ సరసన శ్రీదేవి హీరోయిన్‌గా నటించారు. ఇప్పుడు 2026లో అదే టైటిల్‌తో ఒరిజినల్ సిరీస్ రాబోతోంది. మరి ఆ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...

నేటి తరం నిరుద్యోగ యువత కథలను కళ్లకు కట్టేలా రూపొందించిన సిరీసే ఆకలి రాజ్యం (Aakali Rajyam). ప్రముఖ ఓటీటీ 'ఆహా' (Aha)లో ఈ నెల 28 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. వికాస్ వశిష్ట, గీత్ సైనీ, రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించగా... ఎ టెలిఫ్యాక్టరీ బ్యానర్‌పై వంశీ కాంత్ రేవణ నిర్మించారు. 'ఒక డిగ్రీ, ఒక కల, వెయ్యి రిజెక్షన్స్. ముగ్గురు ఫ్రెండ్స్. ఒకే కల. ఇంకా టైం రాలేదని చెప్పే ప్రపంచం.' అంటూ రిలీజ్ చేసిన టీజర్ హైప్ క్రియేట్ చేస్తోంది.

Also Read : Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్

స్టోరీ ఏంటంటే?

ఇంజినీరింగ్ పూర్తి చేసిన ప్రతీ యంగ్ స్టూడెంట్ ఎన్నో కలలు, ఆశలతో ఉద్యోగం కోసం భాగ్యనగరానికి వస్తారు. అమీర్ పేట్ కోచింగ్ సెంటర్స్‌ల్లో నలుగుతూ తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటారు. అలా ఊరికి వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఊరి కాని ఊరిలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చివరకు వారు ఉద్యోగం సాధించారా? అనేది ఈ సిరీస్ స్టోరీ.

Also Read : Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.