Aadarsha Kutumbam: ప్రీమియర్స్ లేవు గానీ రిలీజ్ మీద డౌట్స్ వద్దు... 'ఆదర్శ కుటుంబం'పై నాగవంశీ క్లారిటీ
4 weeks ago 2
ARTICLE AD
''మా రిలీజ్ (డేట్స్) పంక్చువాలిటీ మీద మీకు (ప్రేక్షకులకు) డౌట్ ఉండొచ్చు. కానీ ఈసారి అటువంటి డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దు'' అని నిర్మాత నాగవంశీ సూర్యదేవర (Suryadevara Naga Vamsi) ట్వీట్ చేశారు. ఆయన ఈ ట్వీట్ చేయడానికి రీజన్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' (Aadarsha Kutumbam House No 47). 'ఏకే 47' అని టైటిల్ షార్ట్ చేశారు. ఈ సినిమా విడుదలపై వస్తున్న సందేహాలకు నాగవంశీ ఫుల్ స్టాప్ పెట్టారు.
ప్రీమియర్స్ లేవు గానీ అక్టోబర్ 9నే విడుదల
ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు ముందు రోజు ప్రీమియర్స్ వేయడం సహజంగా జరుగుతోంది. 'ఏకే 47'కు ప్రీమియర్స్ లేవు అన్నమాట. ''అక్టోబర్ 9న నేరుగా థియేటర్లలో కలుద్దాం. ప్రీమియర్లు లేవు" అని ఆయన స్పష్టతనిచ్చారు.
అక్టోబర్ 6న 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్
Aadarsha Kutumbam Trailer Release Date: అక్టోబర్ 6వ తేదీన 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు నాగవంశీ తెలిపారు. ఆ తర్వాత రోజున... అంటే అక్టోబర్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: Don't Trouble The Trouble First Review: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఫస్ట్ రివ్యూ... ఫహాద్ ఫాజిల్ సినిమా చూసి ఎన్టీఆర్, మహేష్ బాబు ఏమన్నారంటే?
Also Read: Naga Chaitanya Maradalu Samanta Dhulipala Half Saree Photos - లంగా వోణీలో నాగచైతన్య మరదలు... ఈ సమంత కూడా హీరోయిన్ అవుతుందా?
Ma release punctuality meeda meeku doubt undachu, kani eesari alanti doubts em oddu 😄 #AdarshaKutumbam #AK47OnOCT9th
We are coming on 9th October. There is no change in that ❤️
6th – Trailer Launch
7th – Advance Bookings Open across both Telugu states
Families andaru mee…
 — Naga Vamsi (@vamsi84) October 1, 2026
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47'లో శ్రీనిధి శెట్టి హీరోయిన్. నివేదా పేతురాజ్ ఓ కీలక పాత్రలో నటించారు. స్పెషల్ సాంగ్ 'నారాయణమ్మ...'లో డింపుల్ హయతి మెరిశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.
Also Read: Maremma OTT Platform - రెండు ఓటీటీల్లోకి 'మారెమ్మ'... రవితేజ ఫ్యామిలీ హీరో మాధవ్ భూపతిరాజు సినిమా స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Read Entire Article