Venkatesh's Aadarsha Kutumbam Trailer Telugu Review : విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబో అవెయిటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం'. ఇప్పటికే రిలీజైన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... ఫన్‌, పంచ్ డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ మరింత అందించేలా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఎలా ఉందంటే?

ఈ మూవీలో చిట్టిబాబు అనే మిడిల్ క్లాస్ మ్యాన్‌గా కనిపించారు వెంకీ. భార్యా పిల్లలే అతని ప్రపంచం. చిన్న ఉద్యోగంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే ఈ మిడిల్ క్లాస్ మ్యాన్, భార్య గొంతెమ్మ కోరికలతో అప్పుల పాలవుతాడు. పెళ్లాం పిల్లలతో చేసే అల్లరి, మధ్య తరగతి అప్పుల చుట్టూ ఈ స్టోరీ సాగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

అలాంటి ఈ ఫ్యామిలీకి ఊహించని జాక్ పాట్ తగులుతుంది. అసలు ఆ అదృష్టం ఏంటి? సాధారణ ఇంటి నుంచి రిచ్ విల్లాలోకి చిట్టిబాబు ఫ్యామిలీ ఎలా వెళ్లింది? అప్పుల ఊబితో పాటు ఊహించని ప్రమాదం నుంచి కూడా చిట్టిబాబు తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, వెంకీ కామెడీ పంచెస్ అదిరిపోయాయి.

Also Read : Mystery Thriller Series OTT : ఒకే ఇంట్లో కోడళ్ల మరణాలకు సమాధానం - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2... తెలుగులోనూ స్ట్రీమింగ్

చిట్టిబాబు పాత్రలో వెంకీ నటిస్తుండగా ఆయన భార్యగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. వీరితో పాటే యువినా పార్థవి, రాజా ప్రజ్వల్, పోలీస్ ఆఫీసర్‌గా నారా రోహిత్, రఘుబాబు, నివేదా పేతురాజ్, సత్య, రావు రమేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న రిలీజ్ కావాల్సిన మూవీ వివిధ కారణాలతో వాయిదా పడింది. ఈ నెల 30న (శుక్రవారం) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.