5 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్‌లో మార్పు

11 months ago 8
ARTICLE AD

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం పుష్ప 2  ది రూల్ బాక్సాఫీస్‌‌ని ఎలా షేక్ చేసిందో అంతా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడా సినిమా రూ. 2000 కోట్లకు చేరువలో ఉంది. ఈ సినిమా కోసం దాదాపు 5 సంవత్సరాలుగా అల్లు అర్జున్ పొడవాటి జుత్తు, గడ్డం పెంచుతూ అదే లుక్‌లో ఉన్నారు. 5 సంవత్సరాలుగా అదే లుక్‌లో, అదే మేకోవర్‌లో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు తన లుక్‌ని మార్చేశారు. 

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన‌లో అరెస్ట్ అవడం, ఆ తర్వాత విడుదలవడం వంటి పరిణామాలతో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేని పరిస్థితికి వెళ్లిపోయారు. ఆ ఘటనతో చిత్రయూనిట్ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. ఇటు అల్లు అర్జున్, అటు సుకుమార్, నిర్మాతలు.. ఎవరూ కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయడానికి ముందుకు రాలేదు. సినిమా సంచలన విజయం సాధించినా.. ఏం చేయలేకపోవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ మోడ్‌లోనే ఉండిపోయారు. 

ఇక దాదాపు 5 ఏళ్ల తర్వాత న్యూ లుక్‌లో దర్శనమిచ్చాడీ ఐకాన్ స్టార్. సంధ్య థియేటర్ ఘటనలో లభించిన రెగ్యులర్ బెయిల్ నిమిత్తం కోర్టు విధించిన షూరిటీలను సమర్పించేందుకు శనివారం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు అల్లు అర్జున్. ఈ కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్.. హెయిర్, గడ్డం ట్రీమ్ చేసి.. కొత్త లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఆయన నాంపల్లి కోర్టులోనికి వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Read Entire Article