దేశంలోనే తొలి పర్యావరణహిత హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ 10 కోచ్‌ల రైలు నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ కాలుష్య రహితంగా ప్రయాణిస్తుంది. ఈ తొలి హైడ్రోజన్ రైలు హరియాణాలోని జింద్- సోనిపత్ మధ్య సేవలు అందిస్తుంది.

భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన రైలు పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును లాంఛనంగా ప్రారంభించారు. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేస్తూ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన ఇంజినీర్లు ఈ మోడ్రన్ రైలును రూపొందించారు. స్టీమ్, డీజిల్, విద్యుత్ రైళ్ల తర్వాత భారత రైల్వే ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా నిలిచింది.