Horoscope Today October 19th - మకర, కుంభ, మీన రాశుల అక్టోబర్ 19 రాశిఫలాలు

మకర రాశి (Capricorn Horoscope Today)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు వ్యాపార లాభాలను సాధించడానికి కష్టపడతారు, కానీ మీ రోజువారీ ఖర్చులు సాధారణంగా సాగిపోతాయి. ఈ రోజు ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కుటుంబ వివాదాల నుంచి బయటపడాలంటే కూర్చుని మాట్లాడేందుక ప్రయత్నించండి. కోపాన్ని కంట్రోల్ చేసుకుని కాస్త ప్రశాంతంగా, తెలివిగా వ్యవహరిస్తే సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తికి సంబంధించిన విషయంలో విజయం సాధించే అవకాశం ఉంది.

ధనస్సు, మకర రాశుల వారఫలాలు అక్టోబర్ 18 to 24 : మీ జీవితంలో కీలక మార్పులు!

కుంభ రాశి (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారికి అక్టోబర్ 19 సోమవారం సంతోషకరమైన రోజు అవుతుంది. మీకు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. కొనసాగుతున్న ఏవైనా కోర్టు కేసులు ఈ రోజు సమస్యను కలిగించవచ్చు. చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మీరు వ్యాపార పనుల మీద ప్రయాణం చేయవచ్చు. ఈ ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు డబ్బు అప్పుగా ఇవ్వొద్దు.. ఎవరి నుంచి తీసుకోవద్దు. ఇచ్చిన డబ్బు రావడం..తీసుకున్న డబ్బు తిరిగి తీర్చడం రెండూ కష్టంగా మారే ప్రమాదం ఉంది.

19-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశిఫలాలు: అఖండ ధనయోగం, అదృష్టం!

మీన రాశి (Pisces Horoscope Today)

మీన రాశి వారికి ఈ రోజు మంచి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు వారి ఆర్థిక పరిస్థితిని బలపరుస్తాయి. పని విషయంలో మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి ఈ రోజు తగ్గే అవకాశం ఉంది. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది . శుభవార్త అందే అవకాశం ఉంది. కొత్త ఇల్లు, వాహనం లేదా భూమి కొనాలనే ప్రణాళిక కూడా ప్రయోజనాలను చేకూర్చవచ్చు. ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు

19-10-2026 మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మహా నవమి రోజు శుభమా, సవాళ్లా?

2026 అక్టోబర్ 19, సోమవారం ఏ రాశుల వారికి ధనలాభం?
సర్వార్థ సిద్ధి మరియు ధృతి యోగం ప్రభావం కారణంగా ధనస్సు, కన్య, మేషం , సింహ రాశుల వారికి ఒక పెద్ద నిధి లాంటి ఆర్డర్, ఉద్యోగంలో పెరుగుదల, పాత పెట్టుబడుల నుంచి గణనీయమైన లాభాలు , వ్యాపార వృద్ధిని పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి.

మహర్నవమి రోజు ఏ రాశివారు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉంది?
వృశ్చిక రాశి ఉద్యోగులు మెరుగైన ప్యాకేజీలతో కూడిన ఆఫర్లను పొందవచ్చు. అయితే కన్య , ధనుస్సు రాశి వారు స్నేహితుల ద్వారా కొత్త కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లను పొందే అవకాశం ఉంది.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహసంచారం ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

మేష రాశి నుంచి మీన రాశివరకూ..12 రాశుల డైలీ రాశిఫలాలు, వారఫలాలు, నెలవారీ ఫలితాలు, రాశులు గ్రహాలు మారినప్పుడు మీ రాశిపై ఉండే ప్రభావానికి సంబంధించిన కథనాలన్నీ తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి